ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు.. క‌న్ఫ‌ర్మ్‌!!

Update: 2022-04-25 10:30 GMT
ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయా?  ఆదిశ‌గా సీఎం జ‌గ‌న్ అడుగులు వేయ‌నున్నారా?  షెడ్యూల్ క‌న్నా ముందుగానే జ‌గ‌న్ రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్నారా? అనేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు.. మ‌రోవైపు.. మారుతున్న రాజ‌కీయాలు గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌.. ఈ దిశ‌గానే అడుగులు వేస్తార‌ని. రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నారు. ఈ నెల 27న పార్టీ నేత‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త‌న ఫోక‌స్ అంతా కూడా... వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనే ఉంటుందని తెలుస్తోంది.

వాస్త‌వానికి జ‌గ‌న్ వ్యూహాలు.. ఇటీవ‌ల కాలంలో ఎన్నిక‌ల కోణంలోనే ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలోనే త‌న కేబినెట్ 2.0ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అన్ని సామాజిక వ‌ర్గాల‌కు.. ప్రాధాన్యం ఇచ్చారు. అదేవి ధంగా రాష్ట్రం అప్పుల పాలైనా.. త‌న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ఆపేది కూడా లేద‌న్నారు. అంతేకాదు.. పేద‌ల‌కు సంక్షేమ ఫ‌లాలు ఇస్తుంటే.. టీడీపీ, జ‌న‌సేన స‌హా ఓవ‌ర్గం మీడియా అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతోంద‌ని అంటున్నారు. అంటే.. మ‌రిన్ని అప్పులు చేసైనా.. రాష్ట్ర సంక్షేమం కొన‌సాగిస్తాన‌ని చెప్ప‌డం వెనుక దీంతోనే ఆయ‌న ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

వాస్త‌వానికి రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చేందుకు రెండేళ్ల స‌మయం ఉంది. అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ త‌న పాల‌న చేసుకునే అవ‌కాశం ఉంది. కానీ, రాష్ట్రంలో మారుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు బెంగ ప‌ట్టుకుం ద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. విప‌క్ష పార్టీలైన టీడీపీ, జ‌న‌సేనలు.. ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతు న్నాయి. స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నాయి. జ‌గ‌న్ పాల‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏ రైతుల స‌మ‌స్య‌ల‌ను అడ్డం పెట్టుకుని.. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చార‌ని ఆయ‌న అనుకుంటున్నారో.. అవే స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేనాని.. పోరాడుతున్నారు.

కౌలు రైతుల స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపుతున్నారు. అంతేకాదు.. ఆత్మ‌హ‌త్య‌లు పెరుగుతున్నాయ‌ని పేర్కొం టూ ఆయా కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఇవ‌న్నీ జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి అంత‌ర్గ‌త సెగ పెంచుతున్నాయి. మ‌రో రెండేళ్ల‌పాటు.. జ‌న‌సేన‌కు అవ‌కాశం ఇస్తే.. ఇలాంటి దూకుడు రాజ‌కీయాలు మ‌రింత పెరిగే ఛాన్స్ ఉంద‌ని.. అప్పుడు ఇంత సంక్షేమం చేసినా.. త‌న‌కు గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ‌ని.. జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు సొంత పార్టీ వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది.

మ‌రోవైపు.. చంద్ర‌బాబు కూడా ప్ర‌జ‌ల్లోకి వ‌స్తున్నారు. ఆయ‌న ప్ర‌తిస‌మ‌స్య‌పైనా స్పందిస్తున్నారు. క్షేత్ర‌స్థా యిలో ప‌ర్య‌టిస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌పాటు.. ఈయ‌న‌కు అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను క‌లిసేందుకు ఆయ‌న జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. ఇలా ఈ రెండు పార్టీల‌కు రెండేళ్ల పాటు అవ‌కాశం ఇస్తే.. త‌మ పుట్టి మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న దీపం(సంక్షేమ ప‌థ‌కాలు సాగుతున్నంత‌వ‌ర‌కు) ఉండ‌గానే ఎన్నిక‌ల‌కు వెళ్లి విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అంటున్నారు.

ఇక‌, సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా మూడేళ్ల‌పాటు నిర్వ‌హించినా.. కేంద్రం నుంచి అప్పులు ద‌క్కే అవ‌కాశాలు క్షీణిస్తున్నాయి. రాష్ట్రం శ్రీలంక మాదిరిగా మారుతుంద‌నే ఆందోళ‌న‌ల‌న నేప‌థ్యంలో కేంద్రం అప్పులు ఇచ్చేందుకు ఆలోచిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దీంతో వ‌చ్చే రెండేళ్ల‌పాటు.. ఈ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసే ప‌రిస్థితి ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చు. ఇలాఇన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న జ‌గ‌న్‌.. ముంద‌స్తుకు వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

బ‌హుశ ఇదే.. విజ‌యంపై పార్టీ నేత‌ల‌ను సుముఖం చేసేందుకు ఈ నెల 27న ఆయ‌న వైసీపీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం..పార్టీలో మార్పులు పూర్తి చేసిన సీఎం జగన్.. ఇక, కార్యాచరణ ప్రకటనకు సిద్దమమ్యారు. ఇదే సమయంలో జగన్ నిర్ణయాలు... ఆలోచనలు చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అనే చర్చ మొదలైంది. అందులో భాగంగానే జగన్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News