భారీ భూకంపం..అదిరిన ఆఫ్ఘన్ ఉత్తరభారతం

Update: 2015-12-26 05:20 GMT
శుక్రవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. మూడు దేశాల్లోని చాలామంది ప్రజలకు కంటి నిండా కునుకులేకుండా చేసింది. విపరీతమైన ఆందోళనల్లోకి నెట్టేసింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అఫ్ఘనిస్థాన్ లోని హిందూకుష్ పర్వత సానువుల్లో భూకంప కేంద్రం కారణంగా భూకంపం చోటు చేసుకుంది. దీని తీవ్రత 6.4గా ఉన్నట్లు గుర్తించారు. అయితే.. మరికొన్ని ప్రాంతాల్లో ఈ తీవ్రత 6.9గా ఉండటం గమనార్హం.

భారీగా చోటు చేసుకున్న భూకంప ప్రభావం ధాటికి అఫ్ఘనిస్థాన్.. పాక్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్.. ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాలు భూకంపం ధాటికి గురయ్యారు. ఈ భూకంపం ధాటికి ప్రాణ నష్టం లేనప్పటికీ (కడపటి సమాచారం ప్రకారం).. పలువురు గాయాలపాలయ్యారు. మంచినిద్రలో ఉన్న సమయంలో హటాత్తుగా భూప్రకంపనలు చోటు చేసుకోవటంతో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.

ఇళ్లల్లో నుంచి పరుగులు తీసి వీధుల్లోకి వచ్చారు. భూకంప తీవ్రత దృష్ట్యా పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పాక్ సర్కారు హెచ్చరించింది. ఇక.. భారత్ లో దేశ రాజధాని ఢిల్లీ.. చండీగఢ్.. జైపూర్ తదితర ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి భూకంప తీవ్రత ప్రజల్ని భయపెట్టింది.
Tags:    

Similar News