బ్రేకింగ్: మహారాష్ట్రలో భూకంపం

Update: 2020-08-18 11:59 GMT
2020 ఎవరికీ ప్రశాంతం లేకుండా చేస్తోంది. ప్రకృతి మనిషితో ఆడుకుంటోంది. ఇప్పటికే కరోనాతో అల్లాడుతున్న ప్రజలను భారీ వర్షాలు కుదుపేస్తున్నాయి. ఇప్పుడు భూప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపాయి.

మహారాష్ట్రలో భూప్రకంపనలు కలకలం రేపాయి. మంగళవారం మధ్యాహ్నం 2.54 గంటలకు నాసిక్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 2.2 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. నాసిక్ కు పడమరాన 88 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

కాగా మహారాష్ట్రలో గతంలోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పాల్ ఘర్ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో ఎలాంటి నష్టం జరగలేదు.
Tags:    

Similar News