వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల తరుచుగా ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రం, నేపాల్ లో కలవరం సృష్టిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.7గా నమోదైంది. సముద్ర ఉపరితలం నుంచి పది కిలోమీటర్ల లోతున ఇది జరిగినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. అధిక తీవ్రతతో ఈ భూకంపం సంభవించిందని వెల్లడించింది. దీనివల్ల కలిగి ప్రమాదులు ఏంటి? సునామీ పొంచి ఉందా? అనే వివరాలపై ఇంకా స్పష్టత లేదు.
సముద్ర లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత వల్ల తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారిందని ఆ సర్వే వెల్లడించింది. దక్షిణ అమెరికా ఆగ్నేయ దిశ తూర్పు పసిఫిక్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించడం గమనార్హం. ఈ ఉదయం 5.42 నిమిషాలకు నేపాల్ లో మరో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 5.8గా నమోదైనట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. ఈ సంఘటన వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాలపై ఇంతవరకు సమాచారం లేదని వెల్లడించింది.
నేపాల్లోని పొఖారా తూర్పు ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. ఈ సంఘటన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపింది. లామ్జంగ్ జిల్లా భుల్భులెను భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేపాల్ జాతీయ భూకంపాల పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం వెల్లడించింది. సుదీర్ఘ విరామం తర్వాత 5.8 తీవ్రతతో అక్కడ భూకంపం వచ్చినట్లు పేర్కొంది.
హిమాలయ పర్వతాల పీఠభూముల కదలికల వల్ల తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈసారి తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. 2015లో నేపాల్ లో పెను భూకంపం సంభవించి అతి ధన, ప్రాణ నష్టం జరిగింది. ఈసారి కలిగిన నష్టంపై ఇంతవరకు స్పష్టమైన సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు.