సులభంగా కరోనా పరీక్షా ...ఇది నిజమా లేక : వైరల్ న్యూస్ ?

Update: 2021-04-28 05:00 GMT
స్మార్ట్ ఫోన్స్ వాడకం పెరిగిపోయినప్పటి నుండి తెల్లారి లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అందరికి ఒకటే పని .. సోషల్ మీడియా లో కాలక్షేపం చేయడం. అయితే , ఈ సోషల్ మీడియా వాడకం మొదలైన తర్వాత ఎంత మేలు జరుగుతుందో అంతకంటే ఎక్కువగా కీడు కూడా జరుగుతుంది. ఏ న్యూస్ ఫేక్ ... ఏ న్యూస్ నిజం అని తెలుసుకోవడానికే ఉన్న సమయం కాస్త అయిపోయితుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. తాజాగా మరో  తప్పుడు ప్రచారం ఊపందుకుంది. ఊపిరి బిగపట్టడం ద్వారా సింపుల్ గా కరోనా ఉందో లేదో తెలుసుకోవచ్చనేది ఆ వీడియోలో ఉన్న అంశం.

ఆ వీడియోలో ఏం ఉంది అంటే ... ఊపిరి బిగపట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్, ఊపిరితిత్తుల పనితీరు తెలుసుకోవచ్చంటూ ఓ వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. అలాగే అందులో మూడు దశలు చూపించేలా వీడియో తయారుచేశారు. మొదటి దశలో ఊపిరి పీల్చుకోవాలి.  రెండో దశలో ఊపిరిని బిగపట్టి ఉంచాలి. మూడో దశలో ఊపిరిని వదిలేయాలి. రెండో దశలో నిర్ణీత సమయం వరకు ఊపిరిని బిగపట్టి ఉంచితే ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేస్తున్నట్టే లెక్క అని, అలాంటి వాళ్లకు కరోనా లేదని చెబుతూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇలా చేయడం ద్వారా కరోనా ఉందా , లేదా అనే విషయాన్ని తెలుసుకోలేమని నిపుణులు చెప్తున్నారు. ఎలాంటి లక్షణాల్లేని కరోనా పాజిటివ్ వ్యక్తి కూడా వీడియోలో చూపించిన విధంగా ఊపిరి బిగపట్టి ఉంచగలడని, అలాంటప్పుడు అతడి లంగ్స్ ఆరోగ్యంగా ఉన్నాయని ఎలా చెబుతారంటూ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.ఇలాంటి వీడియోలు చూసి, ఊపిరి పీల్చుకోవడం ఆపేయడం చేస్తే మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థుతుల దృష్ట్యా .. సోషల్ మీడియా లో వచ్చే వీడియోలు చూసి ఫాలో కాకూడదు అని , ఏదైనా వైద్యుల సలహా మేరకు నడుచుకోవడం మంచిది అని అంటున్నారు.
Tags:    

Similar News