ఎబోలా వ‌చ్చి.. త‌గ్గినోళ్ల‌తో రొమాన్స్ చేస్తే..?

Update: 2015-10-16 22:30 GMT
ప్రాణాలు తీసేసే ఎబోలాకు సంబంధించిన కొత్త విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎబోలా బారిన ప‌డి కోలుకున్న వ్య‌క్తిలో అంత‌ర్లీనంగా ఎబోలా బాక్టీరియా జీవించే ఉంటుంద‌న్న కొత్త విష‌యాన్ని తాజాగా క‌నుగొన్నారు. యూఎస్ ఆర్మీ సైంటిస్టులు.. లైబీరియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ‌యో మెడిక‌ల్ రీసెర్చ్ సంస్థ‌లు సంయుక్తంగా ఒక ప‌రిశోధ‌న నిర్వ‌హించారు. నిజానికి ఈ ప‌రిశోధ‌న అనూహ్యంగా తెర‌పైకి వ‌చ్చింది.

ఒక మ‌హిళ ఎబోలా బారిన ప‌డ‌టం.. అనంత‌రం ఆమె మ‌ర‌ణించ‌టం జ‌రిగింది. ఆమె మ‌ర‌ణంపై ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన వారు విస్మ‌య‌ప‌రిచే అంశాల్ని గుర్తించారు. ఎబోలా బారిన ప‌డిన మ‌హిళ‌.. అంత‌కు ముందు ఎబోలా బారిన ప‌డి కోలుకున్న వ్య‌క్తితో శృంగారంలో పాల్గొన్నారు.

దీంతో సందేహం వ‌చ్చిన సైంటిస్ట్ లు స‌ద‌రు వ్య‌క్తిని క‌లిసి.. అత‌డి వీర్యాన్ని సేక‌రించి ప‌రీక్షించారు. ఆశ్చ‌ర్య‌క‌రంగా అత‌డి వీర్యంలో ఎబోలా వైర‌స్ ఉన్న‌ట్లు గుర్తించారు. మ‌రో అంశం ఏమిటంటే.. ఎబోలా బారిన ప‌డి కోలుకున్నాక అత‌డి ర‌క్త న‌మూనాల్ని ప‌రీక్షిస్తే ఎబోలా నెగిటివ్ వ‌చ్చింది. అంటే.. ర‌క్తంలో నిర్జీవంగా ఉన్న ఎబోలా సూక్ష్మ‌జీవి వీర్యంలో మాత్రం ఉన్న విష‌యాన్ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఈకార‌ణంగానే.. స‌ద‌రు మ‌హిళ‌తో శృంగారం జ‌రిపిన వెంట‌నే ఆమె ఎబోలా బారిన ప‌డ్డారు.

దీంతో శాస్త్ర‌వేత్త‌లు తేల్చిందేమంటే.. ఎబోలా వైర‌స్ ర‌క్తక‌ణాల్లో లేన‌ప్ప‌టికీ వీర్య క‌ణాల్లో మాత్రం వెంట‌నే మార‌ద‌ని.. నిర్మూల‌న జ‌ర‌గ‌ద‌ని తేల్చారు. ఎబోలా వ‌చ్చి త‌గ్గిన త‌ర్వాత ఎప్ప‌టివ‌ర‌కూ స‌ద‌రు వ్య‌క్తి వీర్య క‌ణాల్లో ఎబోలా సూక్ష్మ‌జీవి ఉంటుంద‌న్న విష‌యం తేల్చాల్సిన అంశంపై ఇప్పుడు శాస్త్ర‌వేత్త‌లు దృష్టి సారించారు. ఎబోలా వైర‌స్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌న్న‌ది తాజా ఉదంతం తేలిన‌ట్లైంది.
Tags:    

Similar News