ఢిల్లీ రాష్ట్ర పీఠంపై కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ కు తాజాగా భారీ షాక్ తగిలింది. ఆయన పార్టీ ఆమ్ ఆద్మీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నిర్ణయించిన ఎలక్షన్ కమిషన్ తన నిర్ణయాన్ని రాష్ట్రపతికి పంపింది. అక్కడ ఫైలు ఇపుడు పెండింగ్ లో ఉంది. ఎమ్మెల్యేలుగా ఎంపికైన తర్వాత ఇతర లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న కారణంగా 20 మందిపై ఈ చర్యలు తీసుకోమని ఈసీ సిఫారసు చేసింది. వీరు ప్రస్తుతం పార్లమెంటు సెక్రటరీలుగా కొనసాగుతూ ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం.
ఈసీ తీసుకున్న ఈ స్టెప్ తో ఆప్ పార్టీ భారీ షాక్ కు గురైంది. ఇపుడు దేశ రాజకీయాల్లో ఇదో కలకలం. అయితే, దీనిపై ఆప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో 70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య 66. అంటే ఈ 20 మందిపై వేటు పడినా కూడా ఆప్ ప్రభుత్వం కూలిపోదు. కానీ ఈ నిర్ణయంతో పార్టీ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది.
మొదటి సారి ఢిల్లీలో ఆప్ అధిక స్థానాలు గెలిచినా మెజార్టీ రాక కాంగ్రెస్ తో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, అనతి కాలంలో తన నిర్ణయాలతో ఆప్ సర్కారు కూలిపోయింది. కొంత గ్యాప్ తర్వాత ఆప్ మళ్లీ భారీ మెజారిటీతో గెలిచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఢిల్లీ ప్రజలు ఎంతో మద్దతు ఇస్తున్నా... కేంద్రంతో కేజ్రీవాల్ కు కయ్యం ఉంది. దీని వల్ల కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే, ఇటీవలే కేజ్రీవాల్ ప్రభ మసకబారుతోందని రిపోర్టులు కూడా వస్తున్నాయి. ప్రత్యేక పార్టీగా రాజకీయాల్లోకి వచ్చినా అందరిలాగే ఆయన వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్యేలకు పార్లమెంటరు సెక్రటరీలుగా నియమించింది కేజ్రీవాలే. అంటే ఇంతకాలం డబుల్ పదవులు ఎంజాయ్ చేసిన వారి అసలు పదవులకే ఇపుడు ముప్పు వచ్చింది.