ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్.. జేసీపై ఈసీ సీరియస్

Update: 2019-05-03 10:30 GMT
లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఈ సినిమా చుట్టూ అల్లుముకున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు.. చంద్రబాబును విలన్ గా చూపించిన ఈ సినిమాను విడుదల కాకుండా అడ్డుకున్నారు. రాంగోపాల్ వర్మ ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. ఎన్నికల సంఘం ఏపీలో ఈ సినిమా ప్రదర్శనకు ససేమిరా అంది. దీంతో ఏపీలో మే 23 వరకు కోడ్ అమల్లో ఉండగా లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కావడం జరిగే పని కాదు.

అయితే ఏపీలోని కడప జిల్లాలో సినిమా రెండు ఆటలను ప్రదర్శించినట్లుగా ఫిర్యాదు రావడంతో ఎన్నికల ప్రధానాధికారి చర్యలు తీసుకున్నారు.  ఈసీ ఆదేశాల మేరకు ఏపీలో ఎక్కడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శనకు అనుమతి లేదు. అయితే కడప జిల్లాలో మాత్రం ఆ సినిమా ప్రదర్శించారు.

కడపలో సినిమా ప్రదర్శించినట్టు ఫిర్యాదులు ఈసీ సీరియస్ అయ్యింది. దీనిపై విచారణ చేసిన సీఈవో సినిమా ప్రదర్శన జరిగినట్లు నిర్ధారించారు.  ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సినిమా ప్రదర్శన నియంత్రణలో ఈసీ ఆదేశించిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ విఫలమయ్యారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ సీఈవో ద్వివేదీ సిఫార్స్ చేశారు.

ఇప్పటికే ఈ సినిమా రాజకీయంగా వేడి పుట్టించింది. దీనిపై ఎన్నికల సంఘం సైతం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది.  ఫలితంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పైన చర్యలకు రంగం సిద్ధమైంది.  నేడో రేపో కడప జాయింట్ కలెక్టర్ పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
    

Tags:    

Similar News