మోడీ శిష్యుడి మాట‌ల‌పై ఈసీ సీరియ‌స్!

Update: 2019-04-04 09:54 GMT
ఎన్నిక‌ల వేళ ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించేందుకు వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే నేత‌లు మ‌స్తు మంది క‌నిపిస్తుంటారు. అయితే.. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో అత్యున్న‌త స్థానాల్లో ఉన్న ప‌లువురు కీల‌క నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఈసీ సైతం రంగంలోకి దిగి నోటీసులు అందించే వ‌ర‌కూ వెళుతోంది. ఎందుకిలా మాట్లాడుతున్నారంటూ వివ‌ర‌ణ తీసుకోవాల్సిన ప‌రిస్థితి చోటు చేసుకుంటుంది.

తాజాగా అలాంటి వ్యాఖ్య‌ను చేశారు యూపీ ఫైర్ బ్రాండ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌. ఇటీవ‌ల ఆయ‌న పాల్గొన్న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో.. భార‌త సైన్యాన్ని మోడీ సేన‌గా అభివ‌ర్ణించిన తీరుపై ఈసీ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌పై ఘ‌జియాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ను నివేదిక ఇవ్వాల‌ని కోరిన ఈసీ.. తాజాగా ముఖ్య‌మంత్రిని ఈ అంశంపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసులు జారీ చేసింది.

యోగి ఆదిత్య‌నాథ్ చేసిన ప్ర‌సంగానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ను నిశితంగా ప‌రిశీలించిన అనంత‌రం ఈసీ ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఏప్రిల్ 5లోపు యోగిని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఘ‌జియాబాద్ లో ముఖ్య‌మంత్రి యోగి చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే..  ఉగ్ర‌వాదుల‌కు కాంగ్రెస్ బిర్యానీ పెట్టి పోషిస్తే.. మోడీ సేన వారికి బాంబులు.. బుల్లెట్ల‌తో స‌మాధానం చెబుతోంద‌ని చెప్పారు.

యోగి మాట‌లు.. భార‌త సేన‌ను మోడీ ఆర్మీగా పేర్కొన‌టంపై వివాదంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌టంతో.. వీడియో క్లిప్పుల ఆధారంగా ఘ‌జియాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ ను నివేదిక ఇవ్వాల‌ని ఈసీ కోరింది. ఆయ‌న ఇచ్చిన స‌మాచారాన్ని ప‌రిశీలించిన ఎన్నిక‌ల సంఘం అధికారులు.. ముఖ్య‌మంత్రి యోగికి నోటీసులు ఇచ్చి.. వివ‌ర‌ణ ఇవ్వాల‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల కాలంలో బీజేపీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు నోటికి వ‌చ్చిన‌ట్లుగా వ్యాఖ్యలు చేస్తున్న‌ట్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌వ‌ర్న‌ర్ క‌ల్యాణ్ సింగ్  తో స‌హా ప‌లువురు క‌మ‌ల‌నాథుల మాట‌ల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.



Tags:    

Similar News