తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండూ అధికార టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చేలా ఉండటం గమనార్హం. ఉప ఎన్నికల్లో ఇతర పార్టీలు.. అభ్యర్థులు నామినేషన్లు వేయనీకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించటమే కాదు.. జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లును తప్పించింది.
ఆయన్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేయటమే కాదు.. ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచేసింది. అదే సమయంలో ఆదాయపన్ను శాఖలో సింగంగా పేరున్న బాలకృష్ణన్‌ను హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు ప్రత్యేక వ్యయ పరిశీలకుడిగా నియమించింది. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన అధికారులు కావటం గమనార్హం.
ఈ ఇద్దరు అధికారులు ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుతో పాటు.. తప్పు చేసే వారు ఎవరైనా సరే.. వారిని విడిచి పెట్టరన్న పేరుంది. నిజాయితీగా పని చేయటం.. కమిట్ మెంట్ తో వ్యవహరిస్తారన్న పేరుంది. హుజూర్ నగర్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన 24 గంటల వ్యవధిలోనే వరుస పెట్టి నిర్ణయాలు తీసుకోవటం అధికార టీఆర్ఎస్ కు మింగుడు పడని రీతిలో మారిందని చెప్పక తప్పదు.
జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు స్థానంలో భూపాలపల్లి ఎస్పీగా వ్యవహరిస్తున్న 2012 బ్యాచ్ ఐపీఎస్ భాస్కరన్ ను ఎంపిక చేశారు. తాజా పరిణామాలతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందంటున్నారు.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది బాలకృష్ణన్ గురించి. ఎన్నికల వేళ డబ్బు పంపిణీని సమర్థంగా అడ్డుకోగలిగిన అధికారిగా ఆయనకు పేరుంది. ఆయన ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా వ్యవహరించిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున డబ్బులు పట్టుకొని ఇప్పటికే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న హిస్టరీ ఆయన సొంతమంటారు.
పెద్ద నోట్ల రద్దు వేళలో కర్ణాటక.. గోవాలలో రూ.4300 కోట్ల నల్లధనాన్ని వెలికి తీసిన బాలకృష్ణన్.. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో కర్ణాటక కాంగ్రెస్ నేత.. టాస్క్ మాస్టర్ గా చెప్పే డీకే శివకుమార్ కుటుంబాన్ని ముప్పతిప్పలు పెట్టించి మూడు చెరువుల నీరు తాగించిన పేరు ఆయన సొంతం. కొద్దికాలం క్రితం ఐఆర్ఎస్ గా రిటైర్ అయినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన సేవలు అందిస్తుంటారు.
తాజాగా చోటు చేసుకున్న రెండు పరిణామాలు టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బలేనని చెబుతున్నారు. ఎన్నికల వేళ గులాబీ నేతల హడావుడికి.. హంగామాకు.. తమకు తిరుగులేదన్నట్లుగా వ్యవహరించే ధోరణికి తాజా పరిణామాలు చెక్ పెట్టేవిగా చెప్పక తప్పదు. ఎన్నికలు ఏవైనా.. తాను అనుకున్నట్లుగా జరిగేలా ప్లాన్ చేసుకునే కేసీఆర్ కు తాజా పరిణామాలు మింగుపడనివిగా మారాయన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరీ.. పరిణామాలపై గులాబీ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.