భారత్ చంద్రయాన్.. ఇజ్రాయిల్ ది అదే కథ

Update: 2019-09-07 07:30 GMT
దేశమంతా అందరూ ఎదురుచూసిన చంద్రయాన్2 చివరి నిమిషంలో కమ్యూనికేషన్ కట్ అయిపోవడంతో అంతా నిరాశలో మునిగిపోయారు. ప్రయోగం సక్సెసా? లేక మళ్లీ మనకు కమ్యూనికేషన్ వస్తుందా అన్న ఆసక్తి శాస్త్రవేత్తలు, సాధారణ ప్రజల్లోనూ నెలకొంది. అయితే ఎంతో కష్టపడి భారత్ ప్రయోగించిన ఈ చంద్రయాన్ 2 సేఫ్ ల్యాండింగ్ అయితే బాగుండును అని అందరూ అనుకున్నారు..

అయితే భారత్ ప్రయోగమే కాదు.. ఇటీవలే ఏప్రిల్ లో ఇజ్రాయిల్ దేశానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఏప్రిల్ లో ఇజ్రాయిల్ కు చెందిన తొలి ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపైకి పంపించింది. అమెరికాకు చెందిన ఆర్క్ మిషన్ ఫౌండేషన్ ఇజ్రాయిల్ కు సాయం చేసింది.  దీనిపేరు ‘బెరెషీట్’. ఇజ్రాయిల్ చేపట్టిన ఈ ప్రయోగంలోనూ చంద్రుడిపైకి ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ బెరెషీట్ క్రాష్ అయిపోయింది.

చంద్రుడికి 10 కి.మీల దూరంలో ఉండగా ఇజ్రాయిల్ స్పేస్ క్రాఫ్ట్ ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. బ్రేకింగ్ సిస్టం ఫెయిల్ అయ్యింది. దీంతో చంద్రుడిపై కూలిపోయింది.

అయితే భారత్ ప్రయోగించిన చంద్రయాన్2 చంద్రుడికి 2 కి.మీల దూరంలో ఉండగా సిగ్నల్స్ కట్ అయిపోయాయి.. అది క్రాష్ ల్యాండ్ అయ్యిందా.. సరిగా దిగిందో లేదో తెలియదు.. కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. చంద్రుడిపై ల్యాండ్ అవుతుండగా సిగ్నల్స్ కట్ అయిపోయాయి  క్రాష్ ల్యాండ్ అయ్యే అవకాశం లేదని.. సొంతంగా నియంత్రించుకునే శక్తి చంద్రయాన్2కు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి దిగాక ల్యాండర్ నుంచి విక్రమ్ బయటకు వచ్చి ఇస్రోకు  సిగ్నల్ అందిస్తుందో లేదో చూడాలి. లేదంటే ఇజ్రాయిల్ స్సేస్ క్రాఫ్ట్ లాగే మనదీ అవుతుందో చూడాలి.
    

Tags:    

Similar News