బ్రిటన్ లో ఆర్థిక -రాజకీయ సంక్షోభం.. మళ్లీ ప్రధాని రేసులోకి రిషి సునక్?
ఓటింగ్ లో మన భారతీయ బ్రిటన్ వాసి అయిన రిషి సునక్ ను ఓడించి ప్రధాని పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ కు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. ట్రస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ ఘోరంగా విఫలమైంది. ప్రజలంతా ఇదే బడ్జెట్ అని దుమ్మెత్తి పోశారు. పన్ను కోతలతో తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని అందరూ హెచ్చరించారు. రిషి సునక్ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేశారు. ట్రస్ మాత్రం తాజా మినీ బడ్జెట్ లో ఎన్నికల హామలను యథాతథంగా అమలు చేశారు. అదే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. మాంద్యం దిశగా దేశాన్ని నడిపిస్తోంది.
దీంతో బ్రిటన్ అధికార పార్టీలో లిజ్ ట్రస్ నాయకత్వంపై నమ్మకం సడలుతోంది. ప్రధాని పదవి నుంచి ఆమెను తప్పించి ప్రభుత్వ బాధ్యతలను రిషి సునక్ తోపాటు మరో నేత పెన్నీ మోర్డాంట్ లకు అప్పగించేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారట.. బ్రిటన్ ప్రధాని పదవిని కోల్పోయిన రిషి సునాక్ కు ఇది బంపర్ ఆఫర్ అని అంటున్నారు. లిజ్ ట్రస్ నాయకత్వంపై సొంత పార్టీలోనే సందేహాలు వస్తున్నాయి. దీంతో మరో నేతను పార్టీ నేతలు చూస్తున్నట్టు తెలిసింది. ట్రస్ ను ప్రధానిగా ఎన్నుకొని తప్పు చేశామా? అని అధికార కన్సర్వేటివ్ పార్టీలో చర్చ మొదలైనట్టు తెలుస్తోంది.
లిజ్ ట్రస్ తాజా బడ్జెట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మార్కెట్ ఒడిదుడుకులకు లోనైంది. బ్రిటన్ కరెన్సీ విలువ ఒక్కసారిగా పడిపోయింది. కరెన్సీ విలువను మళ్లీ పెంచేందుకు ఏకంగా బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
దీంతో లిజ్ ట్రస్ తన తప్పు తెలుసుకొని ఆర్థిక మంత్రి ని కూడా తొలగించారు. కొత్త నేతను ఆర్థిక మంత్రిగా నియమించారు. ఈ పరిణామంలో అధికార పార్టీలో లిజ్ ట్రస్ నాయకత్వంపై అపనమ్మకాలు ఏర్పడ్డాయి.
వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ నేతలు ఉన్నారు. దీంతో కొందరు మళ్లీ రిషి పేరును తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.