పశ్చిమ బెంగాల్ లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో పరిశ్రమల శాఖ మంత్రి పార్థా చటర్జీని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు ఆయనకు అత్యంత సన్నిహితురాలు, మోడల్, సినీ నటి అర్పితా ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. వీరిద్దరితోపాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. కాగా మరోవైపు పార్థా చటర్జీని మంత్రి పదవి నుంచి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మమతా బెనర్జీ బహిష్కరించారు.
ఈడీ దాడుల్లో అర్పితా ముఖర్జీ ఇంట్లో రూ.50 కోట్ల డబ్బు, లెక్కలేనంత బంగారం, స్థిర, చరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించిన సంగతి తెలిసిందే. ఈడీ సోదాలు కొనసాగుతున్నంత సేపు ఈడీ చేయిపెట్టినచోటల్లా నోట్ల కట్టలు కుప్పులుతెప్పులుగా లభించాయి.
కాగా మరోవైపు అర్పితా ముఖర్జీకి నాలుగు లగ్జరీ కార్లు ఉన్నాయని అంటున్నారు. వాటి నిండా కూడా డబ్బుల కట్టలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే ఆ నాలుగు లగ్జరీ కార్లను అర్పిత ఎక్కడ దాచిపెట్టిందో చెప్పడం లేదని.. తాము వెతికే పనిలో ఉన్నామని పేర్కొంటున్నారు. ఆ కార్లలో పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా అర్పితా ముఖర్జీని అరెస్టు చేసే సమయంలో ఆమెకు చెందిన ఓ తెల్ల రంగు మెర్సిడెస్ కారును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీంతో పాటు ఆమెకు అత్యంత విలువైన ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్‌వీ, మరో బెంజ్ కారు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసులో అర్పిత అరెస్టయినప్పటి నుంచి ఈ నాలుగు కార్లు కనిపించడం లేదని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆ వాహనాల కోసం అధికారులు గాలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ నాలుగు లగర్జీ కార్ల ఆచూకీని తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా.. అర్పితా ముఖర్జీకి చెందిన మరో నివాసంలో ఈడీ అధికారులు జూలై 28 గురువారం రాత్రి సోదాలు జరిపారు. అయితే ఆ ఇంట్లో ఎలాంటి నగదు లభించలేదని తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంలో అటు అర్పిత తన ఇంట్లో డబ్బంతా పార్థా చటర్జీదేనని తెలిపారు. ఆయన వారానికోసారి తన ఇంటికి వచ్చి డబ్బులు చూసుకుని వెళ్లేవారని ఈడీ అధికారులకు వివరించారు.