సామాన్యుడు బ్యాంకుల వద్దకు వెళ్లి అవసరమైనవి, అవసరం కానివి ఎన్నో పత్రాలు చూపినా రుణం ఇవ్వని బ్యాంకులు బడాబాబులకు మాత్రం ఈజీగా బుట్టలో పడిపోతుంటాయి అనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇలా కంపెనీలను ఆధారంగా చూసి రుణాలు ఇచ్చి తర్వాత మోసపోయాం అని తేల్చుకున్న బ్యాంకులు ఎన్నో ఉన్నాయి. అయితే అలాంటి మోసాల్లో రికార్డ్ స్థాయి చీటింగ్ చేసిన ఉదంతం ఇది. దాదాపు 2650 కోట్ల రూపాయల మేరకు బ్యాంకులకు టోకరా వేసి పరారీలో ఉన్న ముంబైకి చెందిన ఒక కంపెనీ యజమానిని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. బ్యాంకు రుణాలు ఎగవేసిన అతి పెద్ద కేసులలో ఇదొకటిగా భావిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) కింద మెస్సర్స్ జూమ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జెడ్పీఎల్) కంపెనీ డైరెక్టర్ - ప్రధాన ప్రమోటర్ విజయ్ ఎం చౌదరిని అధికారులు అరెస్టు చేశారు. ఈ కంపెనీ, దాని ప్రధాన నిర్వాహకులు 25 బ్యాంకుల ను 2650 కోట్ల మేరకు మోసం చేశారని అభియోగం. ఈ సంస్థకు కాలిఫోర్నియాలో ఉన్న 1280 ఎకరాల భూమిని ఈడీ 2015 జూలై లో జప్తు చేసింది.
నష్టాలు వచ్చాయంటూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ - సిండికేట్ బ్యాంక్ - కెనరా బ్యాంక్ - యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - యూనియన్ బ్యాంక్ లకు రూ.966 కోట్ల మేరకు జూమ్ డెవలపర్స్ కంపెనీ టోపీ పెట్టిందని ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా మరో 25 బ్యాంకులను కూడా ఇదే పద్ధతిలో మోసం చేసిందని పేర్కొంది. ఈ మొత్తం మోసం విలువ రూ.2650 కోట్ల పైమాటేనని తెలిపింది. రుణం తీసుకోవడం కోసం చౌదరి చూపించిన కంపెనీలన్నీ డొల్ల కంపెనీలేనని పేర్కొంది. ఇక్క డి బ్యాంకుల నుంచి రుణాల రూపంలో తీసుకున్న సొమ్మును విదేశాలకు తరలించి, అక్కడ ఆస్తులు పోగేశారని ఈడీ వివరించింది. ఇదే కేసులో విజయ్ ఎం చౌదరి అనుచరుడు శరద్ కబ్రాను గతంలోనే ఈడీ అరెస్టు చేసింది. తన, తనవారి పేరిట చౌదరి మొత్తంగా 485 కంపెనీలను ఏర్పా టు చేశాడు. వీటిలో అమెరికాలో 15 - బ్రిటన్ - స్విట్జర్లాండ్ లలో మూడు చొప్పున - సింగపూర్ లో ఏడు - జర్మనీలో నాలుగు - ఎమిరేట్స్‌లో తొమ్మిది - చైనా - జింబాబ్వేల్లో రెండేసి కంపెనీలు ఉన్నాయి. పన్ను ఎగవేతదారులకు స్వర్గధామమైన లిక్టన్ స్టైన్ లో రెండు ట్రస్టులను ఏర్పాటు చేశాడని ఈడీ తెలిపింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/