ఢిల్లీ మద్యం కేసులో ఈడీ వేసిన చార్జ్ షీట్లలో పేర్కొన్న వారి పేర్లు చూశాక అందరిలోనూ ఒక్కటే డౌట్ కొడుతోంది. కల్వకుంట్ల కవితతోపాటు ఏపీ నేతలు, వ్యాపారుల పేర్లు ఈ లిస్ట్ లో ఉండడం చూస్తే బయట కొట్టుకునే వీరంతా లోపల మాత్రం వ్యాపారాలు చేస్తూ సంపాదించుకుంటున్నారన్న ఆరోపణలను ప్రతిపక్షాలు చేస్తున్నాయి. తెల్లారితే ఆంధ్రోళ్లు అని తిట్టేవారంతా కూడా తెరవెనుక వారితోనే వ్యాపారాలు చేస్తున్న వైనం వెలుగుచూస్తోంది.
తెలంగాణ అంటే తమ పార్టీనే అని చెప్పుకునే కల్వకుంట్ల ఫ్యామిలీ ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. కవిత పేరు ఈడీ ఎఫ్ఐఆర్ లో రావడంతో ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే కవితతోపాటు ఆంధ్రా నేతలు, ప్రముఖుల పేర్లు ఉండడంతో కవితకు , ఆంధ్రా వారితో ఉన్న అనుబంధం బయటపడింది. కవిత ఆంధ్రా మూలాలున్న వారితో వ్యాపారం చేసిందని.. బయట మాత్రం వీరు తెలంగాణ కోసం ఫైట్ చేస్తున్నట్టు కలర్ ఇస్తారని ప్రత్యర్థులు ఆడిపోసుకుంటున్నారు.
తాజాగా ఈడీ ఛార్జ్ షీట్ లో కవితతోపాటు ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, బినయ్ బాబు, విజయ్ నాయర్ ల పేర్లు చూస్తే.. ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికంటే ఏపీకి చెందిన వారే మెజార్టీ ఉన్నారు.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారితో కవిత వ్యాపారం చేస్తోందన్న విమర్శలను ప్రతిపక్షాలు ెత్తిచూపుతున్నాయి. ఇంతకాలం తెలంగాణ పేరుతో సెంటిమెంట్ రాజేసి ఇప్పుడు రాజకీయంగా లబ్ధి కోసం కేసీఆర్ ఫ్యామిలీ ఇలా నాటకాలు ఆడుతున్నారా? అన్న అనుమానాలను లేవనెత్తుతున్నారు. కవిత వ్యాపార భాగస్వాముల పేర్లను పైకి తీసి మరీ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
తెలంగాణ కోసం పోరాడుతున్న కవిత ఆంధ్రా వారితో వ్యాపారాలు చేయడం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ పరిణామాలు ఇప్పుడు కవితను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.