అమెరికన్ ‘ఇంగ్లిష్’.. శతాబ్దాల తర్వాత అగ్రరాజ్యానికి ఓ అధికారిక భాష
రెండోసారి అధ్యక్షుడు అయ్యాక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్.. అమెరికా ‘అధికారిక భాష’ లోటును తీర్చారు.;
ఎప్పుడో 1776లో స్వాతంత్ర్యం పొంది.. ప్రపంచంలోనే అగ్ర రాజ్యం, పెద్ద ఆర్థిక శక్తిగా.. ప్రపంచానికే పెద్దన్నగా ఎదిగిన అమెరికాకు ఇన్నాళ్లూ అధికారిక (అఫీషియల్ లాంగ్వేజ్) లేదంటే నమ్ముతారా..? ప్రపంచంలోని ప్రతి దేశం ప్రజలు సెటిల్ కావాలనుకునే అమెరికాలో ఏ భాషకూ అధికార భాష హోదా లేదంటే ఆశ్చర్యమే కదూ...? అగ్రరాజ్యంలో మెజార్టీ ప్రజలు మాట్లాడే భాష ఆంగ్లం అని మనందరికీ తెలుసు.. ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవహారాల్లో వాడేది ఇంగ్లిషే అయినా.. అనేక దేశాల వారు వచ్చి శాశ్వతంగా నివాసం ఉండిపోవడంతో అమెరికాలో ఇతర భాషలు బాగా ప్రాచుర్యం పొందాయి.
రెండోసారి అధ్యక్షుడు అయ్యాక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్.. అమెరికా ‘అధికారిక భాష’ లోటును తీర్చారు. ఈ మేరకు దేశ అఫీషియల్ లాంగ్వేజ్ గా ఇంగ్లిష్ ను గుర్తిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు. వాస్తవానికి అమెరికాలో 30 రాష్ట్రాలు ఇప్పటికే ఇంగ్లిష్ ను అధికార భాషగా గుర్తించాయి. అది వాటి వరకే పరిమితం.
అమెరికా అధికార భాషగా గుర్తింపు కోసం కాంగ్రెస్ చట్టసభ సభ్యులు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేశారు. అవేవీ విజయవంతం కాలేదు. ట్రంప్ రెండోసారి వచ్చాక ఇప్పుడు నెరవేరింది.
ఇంగ్లిష్.. కొందరు భారతీయులు ఈ లాంగ్వేజ్ లో ఎంత ఫాస్ట్ గా ఉంటారో..? మరికొందరు అంత వెనుకబడి ఉంటారు. మనలో కొందరికైతే ఇంగ్లిష్ అంటే వణుకే..?
అలాంటి ఇంగ్లిష్ లో అమెరికన్ ఇంగ్లిష్.. బ్రిటిష్ ఇంగ్లిష్ అనే రెండు రకాలు ఉన్నాయి. వీటిలో తేడాలు కూడా ఎక్కువే.
ఉచ్ఛారణ (ప్రనౌన్సిషేయన్), స్పెల్లింగ్, సంభాషణ (వొకాబులరీ), గ్రామర్.. ఇలా ప్రతిదాంట్లోనూ అమెరికన్ ఇంగ్లిష్, బ్రిటిష్ ఇంగ్లిష్ మధ్య తేడాలు ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికన్లు అచ్చులను (ఒవెల్స్) నొక్కి చెబుతారు. బ్రిటిష్ వారు హల్లులను (కాంసోనెంట్స్) నొక్కి చెబుతారు.