లేటెస్ట్ గా.. జగన్ ఖాతాలో మరో కేసు చేరింది

Update: 2016-03-31 07:24 GMT
ఏపీ విపక్ష నేత కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేసులేం కొత్తకాదు. పలు ఆరోపణల మీద ఇప్పటికే ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు. తాజాగా పాత ఆరోపణల మీద కొత్త కేసు ఒకటి ఆయన ఖాతాలో చేరింది. తాజాగా ఈడీ ఆయనపై మరో కేసు నమోదు చేసింది. కేసు కొత్తదే అయినా ఆరోపణలు మాత్రం పాతదే కావటం గమనార్హం. జగన్ మీద ఇప్పటికే 11 కేసులు ఉన్నాయి. వీటి విచారణ నాంపల్లి కోర్టులో సాగుతున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా నమోదు చేసిన కేసు విషయానికి వస్తే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో రాంకీ సంస్థకు రూ.134 కోట్ల మేర లబ్ధి చేకూరుస్తూ వైఎస్ సర్కారు వ్యవహరించిందని.. దీనికి ప్రతిగా రాంకీ సంస్థ.. జగన్ కు చెందిన జగతి పబ్లికేషన్ లో రూ.10కోట్లు పెట్టుబడి పెట్టిన విషయంపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో నిందితులుగా జగన్.. ఆయన ఆడిటర్ విజయసాయి రెడ్డి.. రాంకీ సంస్థ అధినేత అయోధ్యరామిరెడ్డి తదితరుల పేర్లు నమోదు చేశారు. తాజా కేసుతో జగన్ మీద ఉన్న కేసుల సంఖ్య 12కు చేరినట్లైంది.
Tags:    

Similar News