స్వతంత్ర భారతంలో విచారణకు హాజరైన ఫస్ట్ గాంధీ ఫ్యామిలీ జనరేషన్

Update: 2022-06-14 07:34 GMT
గాంధీ ఫ్యామిలీ అంటే కాంగ్రెస్ పార్టీలోనే కాదు దేశ ప్రజల్లో కూడా ప్రత్యేకమైన ఇమేజ్, అభిమానముంది. గాంధీ ఫ్యామిలీ అంటే స్వాతంత్ర్య సమరంలో ముందుండి ఉద్యమాలను నడిపి బ్రిటీషు వాళ్ళని గడగడలాడించిన  మహాత్మా గాంధీ ఫ్యామిలీ కాదు. కానీ జవహర్ లాల్ నెహ్రూ కూతురు, దివంగత ప్రధానమంత్రి ఇందిరకు గాంధి ట్యాగ్ వచ్చి ఇందిరాగాంధి అయ్యేటప్పటికి  ఆమె వారసులందరు గాంధీలే అయిపోయారు.

సరే విషయం ఏదైనా అలాంటి గాంధీ ఫ్యామిలిలో దర్యాప్తు సంస్ధల ముందు హాజరైన మొదటి గాంధీ రాహుల్ గాంధీనే. గతంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నపుడు బోఫోర్స్ కుంభకోణం మెడకు చుట్టుకున్నప్పటికీ దర్యాప్తు సంస్ధలు విచారణ జరిపాయి.  అంతేకానీ ప్రత్యేకించి అప్పట్లో రాజీవ్ ను విచారణకు రమ్మని నోటీసులివ్వటం, విచారణకు హాజరవటం జరిగినట్టు లేదు.

ప్రస్తుతం నేషషల్ హెరాల్డ్ పత్రిక కొనుగోలు వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు మాత్రం ఎన్ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ ఉన్నతాధికారుల ముందు విచారణకు హాజరు కాక తప్పలేదు. అనారోగ్యం కారణంగా సోనియా ఆసుపత్రిలో చేరగా సోమవారం రాహుల్ విచారణకు హాజరయ్యారు.

రాహుల్ ను ఈడీ ఉన్నతాధికారులు దాదాపు 10 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక కొనుగోలు కుంభకోణం జరిగిందా లేదా అన్నది కోర్టులో నిరూపితమవుతుంది.

అయితే అసలు తమ అగ్రనేతలను విచారణే చేయకూడదన్నట్లుగా ఉంది కాంగ్రెస్ నేతల వైఖరి. ఒకవైపు చట్టం, న్యాయం అందరికీ సమానమే అని చెబుతున్న నేతలు మరోవైపు సోనియా, రాహుల్ పై కక్ష సాధింపు చర్యలు దిగినట్లు మండిపడుతున్నారు.

రాహుల్ ను విచారించే సమయంలో ఢిల్లీలో నిరసనలు తెలపడం, దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయటం దేనికి సంకేతాలు. దర్యాప్తు సంస్థలు తమ అగ్రనేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని బెదిరిస్తున్నట్లే ఉంది కాంగ్రెస్ నేతల ప్రకటనలు. దీనికన్నా ప్రశాంత వాతావరణంలో విచారణ జరిగుంటే గాంధి ఫ్యామిలీకే హుందాగా ఉండేది. ఏదేమైనా విచారిస్తున్న దర్యాప్తు సంస్ధలనే బెదిరించేట్లుగా వ్యవహరించటం ఎంతమాత్రం మంచిది కాదు.
Tags:    

Similar News