ఈడీ ముందుకు రాహుల్‌.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సీనియ‌ర్ల అరెస్టులు

Update: 2022-06-13 10:30 GMT
కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌(ఈడీ) అధి కారుల ముందుకు హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ.. కాంగ్రెస్ నాయ‌కులు దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు అనుమ‌తి లేదంటూ.. ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా.. ప‌లు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కీల‌క నాయ‌కుల‌ను అరెస్టు చేశారు. వీరిలో ముఖ్య‌మంత్రి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. మ‌రో వైపు.. న్యాయ విచార‌ణ‌కు హాజ‌రైతే.. త‌ప్పేంట‌ని.. బీజేపీ నాయకులు ప్ర‌శ్నిస్తున్నారు.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఆందోళనల్లో పాల్గొనడంపై బీజేపీ మండిపడింది. అవినీతికి మద్దతిస్తూ వీరంతా ర్యాలీలు చేస్తున్నారని, గాంధీ కుటుంబానికి చెందిన రూ.రెండు వేల కోట్ల ఆస్తులను కాపాడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ధ్వజమెత్తింది. ఆందోళనలు చేస్తూ ఈడీపై కాంగ్రెస్ ఒత్తిడి పెంచుతోందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.

"ఎవరూ చట్టానికి అతీతులు కాదు. రాహుల్ గాంధీ కూడా అంతే. చేసిన అవినీతి బయటపడింది కాబట్టే ఈడీపై ఒత్తిడి పెంచేందుకు వారు ఇలా చేస్తున్నారు. హవాలా ఆపరేటర్ డాటెక్స్ మర్చండైజ్తో గాంధీ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి? దీని గురించి కాంగ్రెస్ నేతలు ప్రశ్నించాలి. రూ.2వేల కోట్ల ఆస్తుల్ని చేజిక్కించుకునేందుకు 'యంగ్ ఇండియన్'ను ముంచేశారు.

రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న మాజీ న్యూస్పేపర్ పబ్లిషింగ్ కంపెనీపై గాంధీ కుటుంబానికి ఎందుకు అంత మక్కువ? రాహుల్ బావగారికే(రాబర్ట్ వాద్రాను ఉద్దేశించి) కాదు గాంధీ కుటుంబం అంతటికీ రియల్ ఎస్టేట్ అంటే ఇష్టమే.`` అని ఇరానీ వ్యాఖ్యానించారు.

తొలిసారి విచార‌ణ‌కు రాహుల్‌

మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాల యానికి వెళ్లారు. విచారణరు రావాల్సిందిగా ఈడీ సమన్లు పంపించిన నేపథ్యంలో రాహుల్ ఈడీ ఎదుట హాజరయ్యారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రాహుల్ వెంట ర్యాలీగా వెళ్లారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. వీరి ర్యాలీలకు అనుమతులు లేవని చెబుతూ వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్, కాంగ్రెస్ సీనియర్ నేతలు రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్, అధీర్ రంజన్ చౌదురి వంటి ప్రముఖులనూ తమ అధీనంలోకి తీసుకొని.. పోలీస్ స్టేషన్కు తరలించారు. కాగా, పోలీసులు తమతో అనుచితంగా ప్రవర్తించారని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ ఆరోపించారు. ఈడీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలో పోలీసులు తమపై చెయ్యి చేసుకున్నారని తుగ్లక్ రోడ్ స్టేషన్ హౌస్ అధికారికి లేఖ రాశారు. మరోవైపు, వీరిని పరామర్శించేందుకు ప్రియాంకా గాంధీ.. పోలీస్ స్టేషన్కు వెళ్లారు.
Tags:    

Similar News