కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో జూన్ 2న ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీని ఈడీ ఆదేశించింది. అయితే తాను దేశంలో లేనని.. ఈడీ ముందు హాజరు కావడానికి మరికొద్ది రోజులు సమయం కావాలని రాహుల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోరిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈడీ తాజాగా మరోసారి ప్రత్యేకంగా రాహుల్ గాంధీకే ఈ నోటీసులు జారీ చేసింది. జూన్ 13వ తేదీన విచారణాధికారుల ఎదుట హాజరవ్వాల్సిందిగా కోరింది. కాగా రెండు రోజులు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది
. కాగా, ఈ సమన్లపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులకు అణచివేసేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలా రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తోందని మండిపడుతున్నారు. 2015లోనే ఈడీ ఈ కేసును మూసివేసిందని, ఇప్పుడు మళ్లీ విచారణ చేపట్టడం వెనుక ప్రతిపక్షాలను అణచివేయాలనే కుట్ర ఉందని నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను కక్ష సాధింపు చర్యగా పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించారని.. ఆ సమయంలో బ్రిటిష్ వారు దానిని అణిచివేసేందుకు ప్రయత్నించారని గుర్తు చేసింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా అదే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం ఈడీని ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఆయన చెప్పారు. పగ, రాజకీయ కారణాలు, కాంగ్రెస్ నాయకులపై ద్వేషం వంటి కారణాలతోనే బీజేపీ ప్రభుత్వం ఈ కేసులు నమోదు చేసిందని మండిపడ్డారు.
ఇక నేషనల్ హెరాల్డ్ కేసు పూర్వాపరాల్లోకి వస్తే.. నేషనల్ హెరాల్డ్ పత్రికను దివంగత భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1938లో స్థాపించారు. ఇందులో నెహ్రూతో పాటు 5000 మంది స్వాతంత్ర్య సమరయోధులు వాటాదారులుగా ఉన్నారు. ఈ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజెఎల్) ఆధ్వర్యంలో నడిచేది. నష్టాల కారణంగా 2008లో పత్రిక మూతపడింది. పత్రిక మూతపడే నాటికి ఇందులో వాటాదారుల సంఖ్య 1000కి తగ్గింది.
మూతపడిన నేషనల్ హెరాల్డ్ ప్రతికను తిరిగి ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ ఏజెఎల్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇచ్చింది. అయినప్పటికీ ఆ పత్రిక ప్రారంభం కాలేదు. పైగా ఏజెఎల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి రూ.90 కోట్లు బకాయి పడింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన ఆ రూ.90 కోట్లు అప్పు సోనియా, రాహుల్‌లకు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్)కు బదలాయించింది. అంత అప్పు చెల్లించుకోలేని స్థితిలో ఉన్న ఏజెఎల్ అప్పులకు బదులు సంస్థ వాటాలన్నింటినీ వైఐఎల్‌కు బదలాయించింది. ఇందుకు గాను వైఐఎల్ సంస్థ కేవలం రూ.50 లక్షలు మాత్రమే చెల్లించింది.
అలా ఏజెఎల్ వాటా మొత్తాన్ని సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన వైఐఎల్‌కు బదలాయించడం ద్వారా ఆ సంస్థకు చెందిన రూ.2 వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా వైఐఎల్ సొంతమయ్యాయి. ఏజెఎల్‌లో మిగతా వాటాదారులను విస్మరించి ఏకపక్షంగా ఈ వ్యవహారం జరగడం... కేవలం రూ.90 కోట్ల అప్పుకు సంస్థ ఆస్తులన్నీ బదలాయించడం.. ఇదంతా చట్ట విరుద్దంగా జరిగిన వ్యవహారమనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై 2012లో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏజెఎల్-వైఐఎల్ మధ్య జరిగిన వ్యవహారంలో సోనియా, రాహుల్‌లు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాదు, ఓ రాజకీయ పార్టీ పబ్లికేషన్ సంస్థకు రూ.90 కోట్లు అప్పుగా ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇదే కేసులో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ సోనియా, రాహుల్‌కు సమన్లు జారీ చేసింది.