కేసినో వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ కీలక నేతకు ఈడీ షాక్‌!

Update: 2022-11-17 06:30 GMT
విదేశాల్లో కేసీనోల నిర్వహణ, భారీ ఎత్తున నగదు చేతులు మారిన వ్యవహారం, మనీలాండరింగ్‌ తదితరాలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది.

టీఆర్‌ఎస్‌ ముఖ్య నేత, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ,  మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌ దేవేందర్‌రెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌కు షాక్‌ తగిలింది.

ప్రత్యేక విమానాల్లో శ్రీలంక, నేపాల్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు తీసుకెళ్లి అక్కడ కేసినో ఆడించిన వ్యవహారంలో ఇప్పటికే కేసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌పై ఈడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణలో భాగంగా టీఆర్‌ఎస్‌ మంత్రి తల­సాని శ్రీనివాస్‌యాదవ్‌ సోద­రు­లు మహేశ్, ధర్మేందర్‌లకు ఉన్న సంబంధాలపై ఈడీ నవంబర్‌ 16న ప్రశ్నించింది. చీకోటి ప్రవీణ్‌ నిర్వహించిన ఈ కేసీనోలకు తలసాని సోదరులు  హాజరయ్యారన్న సమాచారం ఈడీకి ఉంది. దీంతో ఈడీ అధికారులు వారి నుంచి పలు వివరాలు తెలుసుకున్నారు.

విదేశాల్లో కేసినోల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరులను ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

ఇక్కడ కరెన్సీని విదేశాలకు హవాలా ద్వారా చేరవేసి, అక్కడ కరెన్సీ తీసుకున్నారా? ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందా... ఇలా పలు అంశాలపై మంత్రి తలసాని సోదరులను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం.

అదేవిధంగా ట్రావెల్‌ ఏజెన్సీ ద్వారా జరిగిన విదేశీ ప్రయాణాల విమాన టికెట్ల బుకింగ్‌ వ్యవహారాలను కూడా ఈడీ సేకరించినట్లు చెబుతున్నారు. వీరిని మరోసారి విచారించనున్నట్లు తెలిసింది.

మరోవైపు చీకోటి ప్రవీణ్, ఆయన ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు. ఈ కేసీనో వ్యవహారంలో ఎవరెవరూ ఉన్నారన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నట్టు సమాచారం.

ఫోన్‌ సంభాషణల ద్వారా దాదాపు వంద మంది వరకు ఉన్నట్లు గుర్తించి.. ఆ మేరకు జాబితా సిద్ధం చేసినట్లు తెలిసింది. కేసీనోలతో సంబంధమున్న వారికి నోటీసులు ఇవ్వడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.రమణకు, డీసీసీబీ చైర్మన్‌ ప్రేమేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News