ఎస్ బ్యాంక్ సంక్షోభం.. రుణాల ఎగవేత వంటి అంశాలపై రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా సమన్లు అందడంతో మహారాష్ట్రలోని ముంబయిలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరెట్) ఎదుట గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించిందంట. దీంతో వాటికి సమాధానం చెప్పలేకపోయాడంట. అనిల్ అంబానీకి చెందిన 9 కంపెనీలు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.12,800 కోట్లు రుణాలపై 9 గంటల పాటు విచారణ చేశారంట. తీసుకున్న రుణాలు చెల్లించలేక.. ప్రస్తుతం ఆయన దివాళ తీసిన సమయంలోనే ఎస్ బ్యాంక్ కూడా సంక్షోభం బారిన పడింది. ఈ నేపథ్యంలో దీనికి ఒక కారకుడిగా భావిస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అనిల్ అంబానీని విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.
తన కంపెనీలు సకాలంలో రుణాలు చెల్లించక పోవడంతో నిరర్థక ఆస్తుల జాబితాలోకి చేరాయని ఈడీ గుర్తించి వాటిపై అనిల్ అంబానీని ఆరా తీశారంట. ఎస్ బ్యాంక్ మాజీ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్య బిందు, వారి కుటుంభసభ్యులకు లేదా వారి నిర్వాహకులకు ఏమైనా ఇతర చెల్లింపులు చేశారా అని ప్రశ్నించారంట. మనీ లాండరింగ్ కేసులో అధికారులు విచారిస్తున్నారు. నిరర్థక ఆస్తులు ఎక్కువైన కారణంగానే ఎస్ బ్యాంక్ సంక్షోభంలోకి వెళ్లిందని ఆర్థిక నిపుణులు, కేంద్ర సంస్థ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనిల్ అంబానీ కూడా విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన కంపెనీ ఆస్తులు కూడా నిరర్ధకం కావడంతో అనిల్ అంబానీని ఈడీ పిలిచింది.
ఈ సందర్భంగా రానా కపూర్ ఎస్ బ్యాంకు సీఈఓగా ఉన్నప్పుడు నిబంధనలు ఉల్లంఘించి ఎవరెవరికి, ఏయే కంపెనీలకు రుణాలు ఇచ్చారోనని అనిల్ అంబానీ నుంచి అధికారులు సమాచారం రాబట్టారని సమాచారం. అయితే రానాకపూర్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఎస్ బ్యాంకు నుంచి తాము కేవలం రుణాలు తీసుకున్నామని, వాటిని తిరిగి చెల్లించేందుకు సిధ్ధంగా ఉన్నట్లు ఈడీకి తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రానా కపూర్, ఆయన నిర్వహణలోని కంపెనీల ఖాతాల్లో ఉన్న రూ.4,000 కోట్ల అక్రమ ఆదాయం పై కూడా అధికారుల ఆరా తీశారంట. ఇక ఈనెల 30వ తేదీన తమ ఎదుటకు విచారణ కోసం హాజరు కావాలని చెప్పి అనిల్ అంబానీని పంపించారు.