తెలంగాణ మంత్రివర్గంలో అత్యంత యాక్టివ్ గా ఉండే మంత్రుల్లో ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ముందుంటాడు. ఏదైనా సమస్యపై ఆయన ఇట్టే స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చేస్తుంటాడు. ఇక ట్విట్టర్ లో అయితే కేటీఆర్ ఇలా ఎవరైనా పోస్టు చేయగానే అలా స్పందిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ కేటీఆర్ కు ట్వీట్ చేసింది. దీనికి కేటీఆర్ కూడా కౌంటర్ ట్వీట్ చేశాడు. ఇప్పుడిది వైరల్ గా మారింది.
హీరోయిన్ ఈషా రెబ్బా మహారాష్ట్రలో ప్లాస్టిక్ నిషేధంపై స్పందించింది. ‘భారతదేశంలో ఏఏ రాష్ట్రాలు ప్లాస్టిక్ ను బ్యాన్ చేశాయి.? పలు రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈ బ్యాన్ చేయడం లేదు.. ప్లాస్టిక్ నిషేధంపై దృష్టిసారించి భావి తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు కృషి చేయాలి’ అని కోరుతూ కేటీఆర్ కు ఈషా ట్వీట్ చేసింది.
ఈషీ ట్వీట్ కు వెంటనే కేటీఆర్ కూడా స్పందించారు.. ‘చట్టం ప్రకారం ప్లాస్టిక్ ను నిషేధించినా అది అమలు కాదు.. అమలు పక్కాగా జరగాలంటే ప్రజలు - అధికారులు - ప్లాస్టిక్ తయారీదారులు సమస్య గుర్తించి అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే ప్లాస్టిక్ నిషేధం సంపూర్ణమవుతుంది..’ అని కౌంటర్ ఇచ్చాడు.
ఒక కేటీఆర్ ఇంత త్వరగా తన ప్రశ్నకు స్పందించినందుకు ఈషా సంతోషం వ్యక్తం చేసింది. ‘త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు సార్.. ప్రతిభావంతమైన - సమర్థులైన మీ లాంటి యువ నాయకులు ఉండగా.. ఇది అసాధ్యం అని నేననుకోవడం లేదు. ప్లాస్టిక్ నిషేధంలో మన రాష్ట్రాన్ని కూడా అగ్రస్థానంలో నిలపాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్ కు పొగడ్తలతో డిఫెన్స్ లో పడవేసింది. ఇలా ఈషా-కేటీఆర్ ల మధ్య సరదా చాలెంజ్ ట్వీట్ చర్చనీయంశమైంది.