పాత స్నేహితుడిపై ఈటెల ఫైర్ అవుతున్నారే ?

Update: 2022-06-30 06:29 GMT
తెలంగాణ వాకిట ఫ్లెక్సీల వివాదం కొన‌సాగుతోంది. ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర రావు పై ఈటెల రాజేంద‌ర్ మండి ప‌డుతున్నారు. పాత మిత్రుడి ప్ర‌వ‌ర్త‌న బాలేదంటూ కోపం అవుతున్నారు. దీంతో బీజేపీ మ‌రియు టీఆర్ఎస్ మ‌ధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముఖ్య‌మంత్రి  త‌న నేతృత్వంలో చేప‌ట్టిన అధికారిక కార్య‌క్ర‌మాలు, ప్రణాళిక‌లూ, ప‌థ‌కాలూ వివ‌రిస్తూ భాగ్య‌న‌గ‌రి వ్యాప్తంగా హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవ‌డంపై ఈటెల రాజేంద‌ర్ మండిపడుతూ, ఇందుకు 33 కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం వృథా చేశార‌ని ఫైర్ అవుతున్నారు.

న‌గ‌రంలో మోడీ ఫొటో క‌నిపించ‌కుండా ఉండేందుకు ఆయ‌న ఈ విధంగా చేశార‌ని ఆరోపిస్తూ ఉన్నారు.దీంతో టీఆర్ఎస్ వైఖ‌రికిపై బీజేపీ నుంచి విప‌రీతం అయిన విమ‌ర్శలు వ‌స్తున్నాయి. రాజేంద‌ర్ లాంటి వారు నేరు విమ‌ర్శ‌ల‌కు దిగుతూ ఉన్నారు.

ఆయ‌న‌తో పాటు వివిధ బీజేపీ శ్రేణులు పోరాడి, ప్రాణాలు అర్పించి మ‌రీ ! తెచ్చుకున్న తెలంగాణ అన్న‌ది ఒక్క పార్టీకే చెందిన  ఆస్తిగా మారిపోయింది అన్న త‌రహాలో కామెంట్లు పాస్ చేస్తున్నాయి.

మ‌రోవైపు సాలు మోదీ, సంప‌కు మోదీ పేరిట కేసీఆర్ ఏర్పాటుచేసిన బ్యాన‌ర్ల‌పై ఆంధ్రాలో కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మ‌వాదిగా కేసీఆర్ అంటే  త‌మ‌కు కోపం ఉన్నా, నేరుగా దేశ ప్ర‌ధానిని టార్గెట్ చేస్తూ, బై బై మోదీ పేరిట డిజిట‌ల్ రివ‌ల్యూష‌న్ ఒక‌టి తీసుకురావ‌డం బాగుంద‌ని కూడా అంటున్నారు.

గ‌తంలో మాదిరిగా ప్ర‌త్యేక హోదాను అడిగేందుకే త‌మ ప్రాంత నాయ‌కులు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని వారంతా మండిప‌డుతున్నారు. ఓ విధంగా మోదీని ఢీ కొన‌డం బాగుంద‌ని కూడా వీరంతా అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ప్ర‌త్యేక హోదాను జగ‌న్ అడ‌గ‌కుండా ఉత్తి పుణ్యానికే ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం అస్స‌లు బాలేద‌ని కూడా అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ స్థాయిలో నిర‌స‌న‌లు తెలియ‌జేయక‌పోయినా క‌నీసం మ‌న రాష్ట్రానికి జూలై నాలుగున వ‌చ్చేట‌ప్పుడు అయినా మాట మాత్రంగా అయినా హోదా విష‌యాన్ని వైసీపీ అధినాయ‌క‌త్వం ప్ర‌స్తావిస్తుంది అని తాము అనుకోవ‌డం లేదు అని అంటున్నారు.
Tags:    

Similar News