ఉగ్ర భయంతో ఈఫిల్ టవర్ ‘వణికింది’

Update: 2015-09-21 04:35 GMT
అంతర్జాతీయంగా పలు దేశాల్ని వణికిస్తున్న ఉగ్రవాదం.. యూరప్ లోని పలు దేశాల ప్రభుత్వాలకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఈ మధ్య కాలం వరకూ ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యూరప్ లో ఉగ్ర కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. తరచూ ఏదో ఒక దేశంలో దాడి జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఆదివారం సెలవు దినం కావటంతో రద్దీగా ఉన్న ఈఫిల్ టవర్ దగ్గర ఒక్కసారిగా కలకలం రేగింది. ఉగ్రవాదులు ప్రవేశించారన్న సమాచారంతో ఒక్కసారి ఆంక్షలు ప్రకటించారు. భుజానికి భారీగా బ్యాగు తగిలించుకున్న ఉగ్రవాదులు ముగ్గురు ఈఫిల్ టవర్ మీదకు వెళ్లినట్లుగా సమాచారం అందటంతో ఒక్కసారిగా నిఘా వర్గాలు.. పోలీసులు అలెర్ట్ అయిపోయారు.

వెనువెంటనే ఈఫిల్ టవర్ ను మూసివేసిన వారు.. అణువణువూ గాలింపులు జరిపారు. అనుమానితులు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. అయితే.. ఉగ్రవాదులుగా భావిస్తున్నఆ ముగ్గురూ.. ప్యారాచూట్ల సాయంతోతప్పించుకొని ఉంటారని భావిస్తున్నారు. భారీ ఇనుప కట్టడమైన ఈఫిల్ టవర్ ఎలాంటి ప్రతికూలతల్ని ఎదుర్కొన్నా.. ఉగ్రభయంతో మాత్రం కాసేపు వణికిపోయిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News