ప‌ద్మ‌నాభ స్వామి నామంలో 8 వ‌జ్రాల చోరీ!

Update: 2017-07-03 08:53 GMT
గ‌తంలో కేర‌ళ‌లోని అనంత పద్మనాభ స్వామి ఆలయం పేరు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్మోగిపోయిన సంగ‌తి తెలిసిందే. లక్ష కోట్ల విలువైన బంగారంతో ఆ ఆల‌యానికి దేశంలోనే అత్యంత సంప‌న్న‌మైన ఆల‌యంగా  గుర్తింపు ల‌భించింది. అంత‌టి ప్రాధాన్యం ఉన్న ఆల‌యంలో దొంగ‌త‌నం జ‌ర‌గడంతో క‌ల‌క‌లం రేగింది.

సాక్ష్యాత్తు పద్మనాభస్వామి నామంలో ఉన్న 8 వ‌జ్రాలు మాయ మ‌య్యాయి.  అయితే, ఈ విషయాన్ని ట్ర‌స్ట్ స‌భ్యులు వెంట‌నే గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ‌ట‌న‌పై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ డైమండ్స్ విలువ అక్షరాలా 21 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ ఘ‌ట‌న గురించి దేవస్థానం సిబ్బందిని పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

ఆల‌య సంపదను అధికారుల మొదలు సేవకుల వరకు ప్రతీఒక్కరూ దోపిడీ చేశార‌ని వార్తలు వ‌చ్చాయి. దీంతో ఆలయంలో జరిగిన అవినీతి అక్రమాలపై ఓ విచార‌ణ కమిటీని నియ‌మించారు. మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆ కమిటీ తన నివేదకను సుప్రీం కోర్టుకు అందజేసింది. అనంతపద్మనాభస్వామి ఆలయంలోవున్న బంగారాన్ని అధికారుల అండతో ఉన్నతస్థాయి వ్యక్తులు, ఉద్యోగులు, కమిటీ సభ్యులు తరలించినట్లు అనుమానం వ్యక్తంచేసింది.

తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి ఆలయం నేప‌థ్యం అత్యంత ప్రాచీన‌మైన‌ది. ఈ ఆల‌యానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉంది. 9వ శతాబ్దం నాటికే ఎంతో ప్రాచుర్యం పొందింది. ట్రావన్కోర్ గంధపు చెక్కలు, ఏనుగు దంతాలు మొదలైన సంపదలతో సుసంపన్నమైంది. నాటి స్థానిక రాజు మార్తాండ వర్మ విలువైన సంపదలు ఎన్నో స్వామివారికి సమర్పించిన విషయం తెల్సిందే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News