అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గతంలో నైట్ క్లబ్ లో కాల్పులు చోటుచేసుకోగా తాజా ఘటనలో అది ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షిస్తున్న సందర్భంగా జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానే రాష్ట్రంలో చోటుచేసుకున్న కాల్పుల్లో 8 మంది మృతి చెందారు. వెస్ట్ స్ప్రింగ్ క్రీక్ పార్క్ సమీపంలోని ఆదివారం రాత్రి ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న సందర్భంగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో దాదాపుగా రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తి తన తుపాకితో కాల్పులు జరపగా ఏడుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. పోలీసులు చేరుకునే సమయానికే అక్కడ తుపాకుల చప్పుడు వినిపించిందని వెల్లడించారు. కాల్పులను గమనించి లోపలికి వెళ్లిన పోలీసు అధికారి దుండగుల్లో ఒకరిని కాల్చి చంపారని పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడిన మరో ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాల్పుల్లో మరణించిన వారంతా యుక్తవయుసులో ఉన్నవారేనని తెలుస్తోంది. అయితే దుండగుడు ఎందుకు కాల్పులు జరిపారనే విషయం ఇప్పటివరకు ఇంకా తేలలేదు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.