ఆ దేశ ఆడోళ్ల జట్టులో అడుతున్నది మగాళ్లే

Update: 2015-10-03 11:44 GMT
క్రీడా ప్రపంచం షాక్ తినే ఘటన ఇది. మత విశ్వాసాల పేరుతో ఉన్న అవకాశాల్ని ఉపయోగించుకొని ఇంత దారుణంగా మోసం చేస్తారా? అని అభిమానులు బిత్తరపోతున్నారు. ఇరాన్ జాతీయ మహిళల ఫుట్ బాల్ టీమ్ లో ఆడే ఎనిమిది మంది సభ్యులు ఆడోళ్లు కాదు మగాళ్లేనంట.

తాజాగా బయటకు వచ్చిన ఈ అంశం షాకినిస్తోంది. ఇరాన్ లోని మహిళలపై చాలానే ఆంక్షలు ఉంటాయి. పురుషుల ఫుట్ బాల్ మ్యాచ్ లు చూసేందుకు మహిళల్ని అనుమతించరు. ఇక.. ఆ దేశ మహిళల ఫుట్ బాల్ జట్టులో మత విశ్వాసాలు దెబ్బ తినకుండా ఉండేందుకు వీలుగా.. ఫుల్  ట్రాక్ సూట్లు వాడేస్తుంటారు. ఇక.. ముఖాన్ని చాలా భాగం కప్పి ఉంచేలా స్కార్ఫ్ వాడేస్తుంటారు. దీన్ని అవకాశంగా తీసుకున్నారేమో కానీ.. పురుషుల్నే లింగ మార్పిడి ఆపరేషన్లు చేసుకొని ఆడోళ్లుగా మారిపోయిన వారే జాతీయ జట్టు సభ్యులుగా ఉండటం కలకలం రేపుతోంది.

పిఫా ర్యాకింగ్లో 59 స్థానంలో ఉంటే ఇరాన్ మహిళల జాతీయ జట్టు.. ఆసియా జట్లలో 13 స్థానంలో ఉంది. 2010లో ఇరాన్ మహిళా జట్టు గోల్ కీపర్ లింగత్వం మీద సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా జట్టులోని సభ్యుల మీద లింగత్వ పరీక్షలు నిర్వహించాలని ఇరాన్ జాతీయ ఫుట్ బాల్ అధికారులు ఫర్మానా జారీ చేశారు. ఈ తనిఖీల్లో వెల్లడైన విషయాలు దిగ్భాంత్రికి గురి చేసేలా ఉండటం గమనార్హం. ఇలా ఆపరేషన్లు చేయించుకున్న పలువురు వివిధ రకాలైన శారీరక సమస్యలతో బాధ పడుతున్నారట. వామ్మో.. ఎంత మోసం.
Tags:    

Similar News