ప్రపంచంలోనే ఖరీదైన.. చౌక నగరాలు ఇవే..!

Update: 2022-12-02 10:32 GMT
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన.. చౌకైన నగరాల జాబితాను ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) తాజాగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 172 ప్రధాన నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయాలను ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించింది. ఈఐయూ జాబితా ప్రకారంగా వివరాలిలా ఉన్నాయి.

న్యూయార్క్.. సింగపూర్ నగరాలు అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. గతేడాది తొలి స్థానంలో నిలిచిన ఇజ్రాయిల్ ఈసారి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. నాలుగో స్థానంలో హాంకాంగ్.. ఐదో స్థానంలో లాక్ ఎంజిల్స్.. ఆరో స్థానంలో జ్యూరిచ్.. ఏడో స్థానంలో జెనీవా.. ఎనిమిదో స్థానంలో శాన్ ఫ్రాన్సిస్కో.. తొమ్మిదో స్థానంలో ప్యారిస్.. పదో స్థానంలో కోపెన్ హ్యాగెన్.. సిడ్నీ నగరాలు నిలిచాయి.

ప్రపంచవ్యాప్తంగా 172 నగరాల్లోని నిత్యావసర ధరలు.. అద్దె.. రవాణా తదితర 400 వ్యయాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వేను ఈఐయూ నిర్వహించింది. ఈ నగరాల సగటు జీవన వ్యయం గతేడాదితో పోలిస్తే 8.1 శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడి అయింది. ఉక్రెయిన్-రష్యా వార్ ఎఫెక్ట్ సైతం ప్రపంచ దేశాల వ్యయాల పెరుగుదలకు కారణమైనట్లు సర్వేలో తేలింది.

అలాగే అత్యల్ప జీవన వ్యయమున్న నగరాలు జాబితాలో డమాస్కస్.. ట్రిపోలి చివరి స్థానంలో నిలిచాయి. ఇక ఎగుమతులు పెరగడంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో పదో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 24వ స్థానంలో నిలిచిన శాన్ ఫ్రాన్సిస్కో ఈసారి 8వ స్థానానికి పడిపోయింది.

దీంతో ఈ ప్రాంతంలో వీరి జీవన వ్యయం ఎంత మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు వడ్డీ రేట్లు భారీగా తగ్గడంతో టోక్యో.. ఒసాకా నగరాలు సైతం ఈ జాబితాలో 24, 33 స్థానాలకు పడిపోయాయని ఈఐయూ ప్రకటించింది. ఓవైపు కరోనా.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ ప్రపంచంలోని నగరాలపై భారీగానే ఎఫెక్ట్ చూపించిందని ఈఐయూ జాబితాను చూస్తే అర్థమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News