బయటపడిన బీజేపీ మద్దతు

Update: 2022-06-24 04:57 GMT
మహారాష్ట్ర సంక్షోభానికి మూలకారణం బీజేపీయే అన్న విషయం అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే ఎక్కడా ప్రత్యక్షంగా తెరమీద మాత్రం కనబడటంలేదు. అయితే తాజాగా గువహతిలోని తిరుగుబాటు ఎంఎల్ఏల శిబిరంలో తిరుగుబాటు నేత, మంత్రి ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు బీజేపీ మద్దతు విషయాన్ని బహిరంగం చేసింది. షిండే మాట్లాడుతూ ఒక జాతీయ పార్టీ మన తిరుగుబాటును చారిత్రాత్మకమని ప్రశంసించింది అని అన్నారు.

ఇదే సహాయంలో తిరుగుబాటు ప్రక్రియలో ఎలాంటి సహాయం చేయటానికైనా సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చిందన్నారు. ఐక్యంగా విజయం మనదే అని చెప్పారు. ఆ జాతీయ పార్టీ, మహాశక్తి పాకిస్థాన్ ను కూడా ఓడించిందని షిండే చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారింది.

తన మాటల్లో షిండే ఎక్కడా బీజేపీ పేరును ప్రస్తావించకపోయినా జాతీయ పార్టీ అని చెప్పటంలో ఆ పార్టీ ఏమిటో అందరికీ తెలిసిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుగుబాటు ఎంఎల్ఏలను ప్రోత్సహించటం, సాయం చేసేది బీజేపీ మాత్రమే.

ఎందుకంటే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమిలోని భాగస్వామి అన్న విషయం తెలిసిందే. కాబట్టి శివసేనలోని తిరుగుబాటు ఎంఎల్ఏలకు ఎట్టి పరిస్దితుల్లో మద్దతివ్వదు. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నది బీజేపీ మాత్రమే. మొన్నటి ఎంఎల్సీల ఎన్నికల్లో కూడా శివసేన ఓట్లను చీల్చింది బీజేపీయే అన్న విషయం అందరికీ తెలుసు.

పాకిస్తాన్ ను కూడా ఓడించిందంటే అది కచ్చితంగా బీజేపీయే. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్ ను మనదేశం చావుదెబ్బ కొట్టినపుడు అధికారంలో ఉన్నది బీజేపీ సంకీర్ణమే. కాబట్టి అందరి అనుమానాలను షిండే తన తాజా వ్యాఖ్యలతో కన్ఫర్మ్ చేసినట్లయ్యింది. పైగా ప్రత్యర్ధి ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి రావటం బీజేపీకి అలవాటుగా మారిపోయింది.

గడచిన ఎనిమిది సంవత్సరాల్లో ఏడు రాష్ట్రాల్లో బీజేపీ ఇలాగే ప్రభుత్వాలను కూల్చి అధికారంలోకి వచ్చింది. కాబట్టి మహారాష్ట్రలో కూడా ఇలాంటి ప్రయత్నాలనే కమలం పార్టీ మొదలుపెట్టిన విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. కాకపోతే సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చినంత మాత్రాన అధికారంలోకి వచ్చే అవకాశముందా ?
Tags:    

Similar News