మహారాష్ట్రలో ఒక ఏక్ నాధ్ షిండే చేసిన ఒకే ఒక పని ఇపుడు దేశంలో అన్ని రాజకీయ పార్టీలలో వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారాని చలాయిస్తున్న బీజేపీ పెద్దలు అయితే ప్రతీ రాష్ట్రంలో ప్రతీ చోటా ఏక్ నాధ్ షిండేలు తయారవుతున్నారని పదే పదే చెప్పి అన్ని పార్టీలను తెగ భయపెట్టేస్తున్నారు. ఇక తెలంగాణాలో చూస్తే బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ తన ప్రతీ ప్రెస్ మీట్ లో ఏక్ నాధ్ షిండేలు ఉన్నారని చెప్పి అధికార టీయారెస్ ని కలవరపెడుతున్నారు. అంటే ఇండైరెక్ట్ గా బీజేపీతో టీయారెస్ అసమ్మతివాదులు చేతులు కలుపుతారు అని చెబుతున్నారు అన్న మాట.
అంతే కాదు తెలంగాణాలో చేరికలకు ఒక బ్రాంచ్ ని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా మాజీ టీయారెస్ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజెందర్ ని చైర్మన్ గా చేశారు. దీన్ని బట్టి చూస్తే ఏక్ నాధ్ షిండేలు అన్న మాట బీజేపీ సీరియస్ గానే అంటోంది అన్న మాట. అయితే ఇపుడు ఏపీలో కూడా కొత్తగా ఇదే మాటను బీజేపీ వారు వినిపిస్తున్నారు. తుపాకీ డాట్ కమ్ దీని మీద జిల్లాల వారీగా సేకరించిన సమాచారం ప్రకారం చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ టీడీపీల నుంచి ఎవరు వచ్చే ఎన్నికల తరువాత ఏం చేయబోతారు, ఇపుడు వారి పరిస్థితి ఏంటి అన్నది చూస్తే ఆసక్తికరమైన విషయాలే వెలుగు చూస్తున్నాయి.
ఒంగోలు : అక్కడ ఉన్న ఇద్దరు అభ్యర్ధులు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్ధన్ వాళ్ల పార్టీలకు కడు విధేయులు కాబట్టి ఇక్కడ ఏక్ నాధ్ షిండేలు లేరనే తెలిసింది.
సంతనూతలపాడు : సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకరబాబు కాంగ్రెస్ నుంచి వచ్చినా అది పెద్దగా లెక్క లేదు. టీడీపీ నుంచి ఉన్న విజయకుమార్ కూడా కాంగ్రెస్ నుంచే వచ్చారు. ఇక రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ నాయకులు చెల్లాచెదురు అయ్యారు. కొందరు వైసీపీకి కొందరు టీడీపీకి వెళ్ళి పోటీ చేశారు. సో వీళ్ళ విషయం ఏంటి అన్నదే వచ్చే ఎన్నికల తరువాతనే చూడాలి మరి.
కొండెపి : ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన బాలవీరాంజనేయులు ఇప్పటి దాకా పార్టీ మారలేదు. ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీలో ఇంతవరకూ ఎవరూ గెలవలేదు కాబట్టి వచ్చే ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం బట్టి ఇక్కడ పరిస్థితి ఏమిటి అన్నది తెలుస్తుంది.
కందుకూరు : ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కందుకూరి మహీధర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చారు. కాబట్టి పెద్దగా అతని మీద వ్యతిరేకత లేదు. గతంలో ఇక్కడ గెలిచిన పోతుల రామారావు పార్టీ మారారు. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు కాబట్టి పెద్దగా చర్చ జరగడంలేదు. ఒకవేళ టీడీపీ కనుక అతనికి సీటు ఇస్తే అతన్ని ఏక్ నాధ్ షిండే జాబితా లెక్కలోకితీసుకోవచ్చు అంటున్నారు
కనిగిరి : బుర్రా మధుసూదన యాదవ్ 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని కనిపెట్టుకుని ఉండి 2019 ఎన్నికల్లో గెలిచారు. జగన్ కూడా అతనికి నాలుగు పోస్టులు ఇచ్చారు కాబట్టి ఆయన పార్టీని వదలడు అని అంటున్నారు. ఇక టీడీపీ తరఫున ఉగ్ర నరసింహారెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చి పోటీ చేశాడు కాబట్టి అతని మీద పెద్దగా పార్టీలో వ్యతిరేకత లేదు అంటున్నారు.
గిద్దలూరు : ఇక్కడ రెండు పార్టీలలోనూ ఏక్ నాధ్ షిండేలు ఉన్నారని అంటున్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు మారని పార్టీ లేదు. పీయార్పీ, కాంగ్రెస్, టీడీపీ వైసీపీ ఇలా చాలా పార్టీలు మారారు. ఆయన కూడా అందరి ముందు నేను చాలా పార్టీలు మారాను అని అంటున్నారు. ఇపుడు పార్టీ ఆదేశం ప్రకారం గడప గడపకు కార్యక్రమన్ని కూడా ఆయన పెద్దగా చేయడంలేదు. దీంతో ఆయన ఏమైనా జనసేన వైపు చూస్తునారా అని అనుకుంటున్నారు. అలాగే టీడీపీ క్యాండిడేట్ కూడా గతంలో వైసీపీ తరఫున గెలిచి టీడీపీలోకి జంప్ చేశారు. ఆయన కనుక మళ్లీ వైసీపీలోకి రావాలని ప్రయత్నం కనుక చేస్తే అతనికి వైసీపీ చాన్స్ ఇవ్వలేదు. దాంతో ఆయన ఇపుడు టీడీపీ వైపు ఉన్నారు. ఒకవేళ రేపటి రోజున ఆయనకు వైసీపీ చాన్స్ ఇస్తే కచ్చితంగా ఆయన జంప్ చేసే అవకాశం ఉంది అంటున్నాఉర్.
మార్కాపురం : వైసీపీ ఎమ్మెల్యే నాగార్జునరెడ్డికి కాంగ్రెస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఆయన తండ్రి కేపీ కొండారెడ్డి, ఆయన మామ కూడా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి వైసీపీలో చేరి టికెట్ తెచ్చుకుని గెలిచారు. ఇక టీడీపీ వైపు చూస్తే నారాయణరెడ్డి మొదటి నుంచి ఆ పార్టీ వైపే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏక్ నాధ్ షిండేలు లేరనే అంటున్నారు.
ఎర్రగొండపాలెం : ఆదిమూలపు సురేష్ కాంగ్రెస్ నుంచి వచ్చి వైసీపీ తరఫున రెండు సార్లు గెలిచి మంత్రిగా రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ నుంచి అక్కడ క్యాండిడేట్ క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ ఏక్ నాధ్ షిండేలు లేరు అనే అంటున్నారు
దర్శి : సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత ఆయన రాజకీయాలకు స్వస్తి పలికారు. అయితే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి సీటు వద్దు అన్న తరువాత కుల సమీకరణలో భాగంగా వేణుగోపాల్ కి వైసీపీ టికెట్ ఇచ్చారు. ఇక వైసీపీ వేవ్ లో ఆయన గెలిచారు. అక్కడ గట్టి క్యాండిడేట్ గా ఉన్న సిద్ధా రాఘవరావు వైసీపీలోకి జంప్ అయ్యారు. అలాగే 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కదిరి బాబూరావు వైసీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఈక్కడ అన్ని పార్టీలలో చాలా మంది ఏక్ నాధ్ షిండేలు ఉన్నారని అంటున్నారు.
అద్దంకి : వైసీపీ నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటి రవి టీడీపీలోకి జంప్ అయ్యారు. మళ్ళీ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా ఆయన ఒక్కరే కావడంతో తన వ్యాపార లావాదేవీల కోసం రాబోయే ఎన్నికల తరువాత ఒకవేళ ఆయన గెలిస్తే ఏక్ నాధ్ షిండే అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి బాగా వీక్ కాబట్టి ఎవరూ పెద్దగా లెక్కలోకి తీసుకోవడంలేదు. ఇక్కడ టీడీపీ అభ్యర్హ్దే ఏక్ నాధ్ షిండే అయ్యే చాన్స్ ఉంది అంటున్నారు.
పరుచూరు : టీడీపీ అభ్యర్ధి రెండు సార్లు గెలిచి ఆ పార్టీకే కట్టుబడి ఉన్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్ధి వీక్ కాబట్టి ఆన్ని లెక్కలోకి తెసుకోవడంలేదు. ఇక్కడ ఏక్ నాధ్ షిండేలు లేరనే అంటున్నారు.
చీరాల : ఇక్కడ అంతా ఏక్ నాధ్ షిండేలే అని అంటున్నారుట. కరణం బలరాం టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఆమంచి క్రిష్ణమోహన్ గతంలో కాంగ్రెస్, ఆ తరువాత ఇండిపెండెంట్, ఆ తరువాత వైసీపీ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. ఒక వేళ ఇక్కడ టికెట్ కరణానికి ఇస్తే ఆమంచి జనసేన వైపు చూస్తారని అంటున్నారు. దాంతో ఇక్కడ అంతా ఏక్ నాధ్ షిండేలే అన్న మాట ఉంది మరి.
మొత్తానికి చూస్తే పన్నెండు నియోజకవర్గాలలో చీరాల గిద్దలూరు, దర్శి నియోజకవర్గాలలో ఏక్ నాధ్ షిండేలు ఉన్నారు. వాళ్ళకు సీట్లు ఇస్తే అంతే అని వైసీపీ టీడీపీలలో చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది అంట. దీని మీద మీకు ఏమైనా సమాచారం ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వార్త ద్వారా ఒక వ్యక్తిని కించపరచడం మా ఉద్దేశ్యం కాదు, కేవలం లోకల్ రిపోర్ట్ మేరకు మాత్రమే మేము ఈ న్యూస్ ఇస్తున్నామని మనవి.