షాకింగ్ : ఒక్క‌ ట్వీట్‌ తో 1400 కోట్ల‌ డాల‌ర్లు మాయం !

Update: 2020-05-03 00:30 GMT
మనం చేసే ప్రతి పని కూడా మనపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు ఆ పనుల వల్ల మనకి మంచి జరిగినా కూడా ఒక్కోసారి మాత్రం కోలుకోలేని దెబ్బకూడా తగులుతుంది. తాజాగా, టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ చేసిన ఒకే ట్వీట్ ఆ సంస్థకు ఏకంగా 14 బిలియన్ల డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాదు, తన సొంత వాటాలో 3 బిలియన్ డాలర్లను కూడా పోగొట్టుకున్నాడు ఎలన్ మాస్క్.

అసలు విషయానికి వస్తే ... టెస్లా కంపెనీ షేర్ విలువ మరి ఎక్కువుగా ట్రేడ్ అవుతుందని ఆయన తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఇన్వెస్టర్లు ఆ కంపెనీ నుండి వైదొలిగారు. ఇక షేర్ వాల్యూ ఎక్కువుగా ఉందన్న ట్వీట్ నిజమేనా అని వాల్ స్ట్రీట్ జ‌ర్న‌ల్ ఆయనను వివరణ కోరగా టెస్లా కాదని సమాధానం ఇవ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది.

అయితే , ఈయనకి ఇప్పుడే కాదు .. గతంలోనూ ఇలాంటి అనుభవం ఉంది టెస్లా వ్యవస్థాపకుడికి.. 2018లో, న్యూయార్క్ స్టాక్ మార్కెట్ లో టెస్లా యొక్క భవిష్యత్తు గురించి ఒక ట్వీట్ చేయగా అది ఏకంగా 20 మిలియన్ డాలర్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది. మరోవైపు, టెస్లా యొక్క షేర్ ధర ఈ సంవత్సరం పెరిగింది, ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల విలువను 100 బిలియన్ డాలర్ల దగ్గరగా ఉంచింది, ఇది వ్యవస్థాపకుడికి వందల మిలియన్ డాలర్ల బోనస్ చెల్లింపును అవకాశం కల్పించింది.. కానీ, అతని ట్వీట్‌తో పరిస్థితి అంతా మారిపోయింది.
Tags:    

Similar News