మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు మీడియా మీట్ ఎందుకు?

Update: 2018-10-06 08:11 GMT
ఊహించ‌ని ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకుంది. ఈ నెల 12 త‌ర్వాత కానీ ఆ త‌ర్వాత కానీ నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తో పాటు.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ వెలువ‌డుతుంద‌న్న అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉద‌యం కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఆస‌క్తిక‌ర స‌మాచారం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ రోజు మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల స‌మ‌యంలో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ మీడియా స‌మావేశానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ముగ్గురు క‌మిష‌న‌ర్లు మీడియాతో మాట్లాడ‌నున్నారు. ఈ మీడియా స‌మావేశంలోనే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన అంశాల‌తో పాటు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని చెబుత‌న్నారు.

తొలుత మ‌ధ్యాహ్నం ప‌న్నెండున్న‌ర‌కు మీడియా స‌మావేశం ఉంద‌న్న ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత అది కాస్తా మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. గ‌డిచిన రెండు రోజులుగా అన్ని రాష్ట్రాల ఎన్నిక‌ల అధికారుల‌తో కేంద్ర ఎన్నిక‌ల సంఘం అధికారులు భేటీ అవుతున్నారు. ఈ రోజు తెలంగాణ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సాంకేతిక నిపుణులు వ‌స్తున్నారు. తెలంగాణ ఓట‌ర్ల జాబితా రూపొందించే విష‌యంలో కొన్ని సాంకేతిక అంశాలు ఇబ్బందిగా మారాయి. ఇదిలా ఉంటే.. ఉన్న‌ట్లుండి ఈసీ మీడియా స‌మావేశానికి ఆహ్వానించ‌టం  రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసిన‌ట్లైంది. ఎన్నిక‌ల షెడ్యూల్ ను ఈ స‌మావేశంలోనే వెల్ల‌డిస్తారా?  లేక మ‌రేదైనా ఆస‌క్తిక‌ర అంశాన్ని ఈసీ ప్ర‌క‌టిస్తుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.


Tags:    

Similar News