ఊహించ‌ని నిర్ణ‌యం: తెలంగాణ‌లో కోడ్ కూసింది!

Update: 2018-09-28 02:47 GMT
ఊహించ‌ని నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌టం ద్వారా కేంద్ర ఎన్నిక‌ల సంఘం షాక్ ను ఇచ్చింద‌ని చెప్పాలి. ముంద‌స్తుకు వెళ్లే క్ర‌మంలో అసెంబ్లీని ర‌ద్దు చేసిన టీఆర్ఎస్ స‌ర్కారు ప్ర‌స్తుతం ఆప‌ద్ద‌ర్మ‌ పాల‌న‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేబినెట్ ర‌ద్దు అయిన నేప‌థ్యంలో.. తెలంగాణ కేర్ టేక్ సీఎంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ఇంకా విడుద‌ల కాక ముందే కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనూహ్య నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. త‌క్ష‌ణం తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని అమ‌ల్లోకి తీసుకొచ్చేసింది. తాజా కోడ్ కార‌ణంగా తెలంగాణ‌లోని ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం కానీ కేంద్ర ప్ర‌భుత్వం కానీ ఎలాంటి కొత్త ప‌థ‌కాల్ని .. ప్రాజెక్టుల్ని ప్ర‌క‌టించ‌టానికి వీలుండ‌దు.

అసెంబ్లీ ర‌ద్దు నేప‌థ్యంలో తెలంగాణ‌లో త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళిని అమ‌ల్లోకి తీసుకొస్తూ గురువారం నిర్ణ‌యం తీసుకుంది. తాము విధించిన కోడ్ ను కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయాల‌ని పేర్కొంది. ఎన్నిక‌ల షెడ్యూల్ తో సంబంధం లేకుండా కోడ్ కూయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది

ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌కుండానే ఒక రాష్ట్రంలో ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని అమ‌ల్లోకి తేవ‌టం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. సాధార‌ణంగా ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన రోజు నుంచి ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని అమ‌ల్లోకి తేవ‌టం మామూలే. దీనికి భిన్నంగా తెలంగాణ‌లో తాజా ప‌రిణామంపై ప‌లువురు ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వ‌చ్చేసిన నేప‌థ్యంలో పార్టీలు.. అవి ప్ర‌క‌టించిన‌ అభ్య‌ర్థులు చేసే ఖ‌ర్చులు ఎన్నిక‌ల ఖ‌ర్చు కింద‌కు వ‌స్తాయా? అన్న‌ది ఇప్పుడు సందేహంగా మారింది.

ఎన్నిక‌ల కోడ్ అన్న‌ది ప్ర‌భుత్వ విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాల‌కు త‌ప్పించి.. అభ్య‌ర్థుల‌కు సంబంధించి కాద‌ని.. ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత మాత్ర‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వాలు కేవ‌లం రోజువారీ కార్య‌క‌లాపాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావాలే త‌ప్పించి ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే పెద్ద పెద్ద విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి వీల్లేద‌ని 1994 నాటి ఎస్ ఆర్ బొమ్మ‌య్ కేసులో సుప్రీం తీర్పును ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల కోడ్ ఎన్నిక‌ల షెడ్యూల్ కంటే ముందే కూయ‌టం తెలంగాణ అప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వానికి కాసింత ఇబ్బందిగా మారుతుంద‌న్న మాట వినిపిస్తోంది. అదెంత వ‌ర‌కూ నిజ‌మో రాబోయే రోజులు స్ప‌ష్టం చేస్తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News