అవును. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందే... సినీ నటుడు విశాల్ గెలిచాడు! ఉత్కంఠ భరితమైన పర్యవసనాల మధ్య ఆయన తన గెలుపును సాధించాడు!! అయితే ఈ గెలుపు ప్రజాక్షేత్రంలో కాకుండా తన రాజకీయ అరంగేట్రం విషయంలో!!! రాజకీయ అరంగేట్రంలో ఆర్‌కే నగర్ ఉపఎన్నికకు విశాల నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా నామినేషన్ అసంపూర్తిగా ఉందని రిటర్నింగ్ అధికారి విశాల్ నామినేషన్ ను తిరస్కరించారు. అయితే తిరస్కరణకు గురైన విశాల్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి అంగీకరించారు. అయితే దీనికి ముందు ఎన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి.
తమిళ తెరపై అనూహ్య రీతిలో ఎదిగిన విశాల్ తన రాజకీయ అరంగేట్రానికి ఆర్కేనగర్ ఉప ఎన్నికను కేంద్రంగా చేసుకున్నాడు. ఇందులో భాగంగా నామినేషన్ దాఖలుకు ముందు దివంగత జయలలిత సమాధిని సందర్శించాడు. ఆమెతో పాటు పలువురిని కూడా ఆయన నామినేషన్ దాఖలుకు ముందు స్మరించుకొని సోమవారం తన పత్రాలు సమర్పించారు. అయితే మంగళవారం అనూహ్యరీతిలో ఆయన నామినేషన్ తిరస్కరణ గురైంది. దీంతో షాక్ తిన్న విశాల్..నిరసనకు దిగారు. కేంద్ర ఎన్నికల అధికారులు నామినేషన్ పత్రంలో తప్పులుండడంతో నామినేషన్ ను తిరస్కరించారు. అందుకు నిరసనగా విశాల్ అభిమానులతో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగాడు. నిరసన చేయడంతో పోలీసులు విశాల్ ను అరెస్టు చేశారు.
అయితే అధికారుల చర్యను నిరసిస్తూ విశాల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టిన సమయంలో ఇటు విశాల్‌కు అటు అధికారులకు మధ్య సంవాదం నడిచిందని తెలుస్తోంది. తను అన్ని వివరాలు పొందుపరిచానని విశాల్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు మీడియాతో మాట్లాడుతూ నామినేషన్ తిరస్కరణ వెనుక కుట్ర ఉందని విశాల్ ఆరోపించారు. కావాలనే తన నామినేషన్ ను తిరస్కరించారని విశాల్ తెలిపారు. అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తారని ఆయన సన్నిహతులు వెల్లడించారు. ఇదిలాఉండగా...అనూహ్యరీతిలో విశాల్ నామినేషన్ అంగీకరించినట్లు అధికారుల నుంచి సమాచారం వచ్చింది. విశాల్ తన అభ్యర్థిత్వానికి ఓమహిళ మద్దతు తెలిపారని పేర్కొన్నారని అయితే...ఆమె నిజంగా విశాల్ ను ప్రతిపాదించలేదని అధికారులు వెల్లడించారు.
అయితే విశాల్ అనంతరం వేలు అనే వ్యక్తితో ఫోన్ సంభాషణను అధికారులకు అందించారు. `విశాల్ కు మద్దతివ్వలేదని చెప్పాలి.లేదంటే మీ కుటుంబంలో ఒకరికి ముప్పు ఖాయం` అని బెదిరించడంతో తాము మద్దతు ఇవ్వలేదని వేలు వెల్లడించారు. ఈ వీడియో నిజమైనదని వెల్లడించారు. అనంతరం ఆయనే పోరాటం అనంతరం తన నామినేషన్ ను మొత్తంమీద అధికారులు అంగీకరించినట్లు తెలిపారు. నిజం ఎల్లప్పుడు గెలిచితీరుతుందని విశాల్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు ఆర్కేనగర్ బరిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మదుసూదనన్ - డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్ - అన్నాడీఎంకే బహిష్కృత దినకరన్( అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున) - బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా తిరస్కరణకు గురైన వారిలో జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ నామినేషన్ కూడా ఉంది. ప్రస్తుతం 145 మంది అభ్యర్థులు బరిలో ఉండగా...నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది డిసెంబర్ 7.
మరోవైపు ఈ పోరాటంపై నామినేషన్ దాఖలుకు ముందు విశాల్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆర్కే నగర్ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు - అమ్మ ఆశయాలకు అనుగుణంగా పని చేసేందుకు ఓ అవకాశం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం - ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత - ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తనకు ఆదర్శమని విశాల్ వెల్లడించారు. ఈ ఇద్దరినీ తాను కలవలేదని పేర్కొంటూ రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ...తనకు సామాన్యుడిగా ఉండటం ఇష్టమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచినా - ఓడినా తనకు ప్రజలకు సేవ చేయడం ముఖ్యమన్నారు. ఆర్కే నగర్ పరిధిలోని ప్రజల తాగు నీరు - పాఠశాలలోని - ఆస్పత్రుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచినా - గెలవలేకపోయినా....తాను వీటికి అంకితంగా పనిచేస్తానని అన్నారు. కాగా,సినీ నటులు కుష్బూ - ప్రకాశ్ రాజ్ - ఆర్య ఇప్పటికే విశాల్ కు మద్దతు ప్రకటించారు.