ఈసీ మార్గ‌ద‌ర్శ‌కాలు ఇవే బాసూ!

Update: 2019-03-11 04:21 GMT
ఎన్నిక‌ల గంట మోగింది. దేశ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు.. ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌ల చేసింది ఎన్నిక‌ల సంఘం. ఆదివారం సాయంత్రం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ తో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చేసింది. దీంతో.. పార్టీ అధినేత‌లు మొద‌లు.. అభ్య‌ర్థులు వ‌ర‌కూ అంద‌రు చేసే ప్ర‌సంగాల‌పై ఎన్నికల కోడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు అమ‌ల్లోకి రానున్నాయి.

మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్లుగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఎన్నిక‌ల మార్గ‌ద‌ర్శ‌కాల్ని అంత‌కంత‌కూ మారుస్తూ వ‌స్తోంది. మొద‌టి ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి ఎన్నిక‌ల‌కు ఈసీ మార్గ‌ద‌ర్శ‌కాల విష‌యంలో పోలిక లేద‌ని చెప్పాలి. ఈ కోడ్ ప్ర‌ధాన ఉద్దేశం ఎన్నిక‌ల సంద‌ర్భంగా అన‌వ‌స‌ర ఘ‌ర్ష‌ణ‌ల్ని.. అవినీతికి చెక్ పెట్ట‌టంగా చెప్పాలి. విద్వేష పూరిత ప్ర‌సంగాలు.. కొంద‌రు నేత‌ల్ని త‌మ‌వైపు తిప్పుకునేలా చేయ‌టం.. ఓటింగ్ ఇష్టారాజ్యంగా జ‌ర‌గ‌కుండా.. అన్ని గైడ్ లైన్స్ ప్ర‌కారం ప్ర‌శాంతంగా జ‌ర‌గాల‌న్న ఉద్దేశంతో ఈసీ కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల్ని సిద్ధం చేసింది.

దీని ప్ర‌కారం.. రాజ‌కీయ పార్టీలు.. అభ్య‌ర్థులు ఏం చేయ‌కూడ‌ద‌న్న దానిపై స్ప‌ష్ట‌త‌నిచ్చింది. ఈసీ మార్గ‌ద‌ర్శ‌కాలు చూస్తే..

1. ప్ర‌భుత్వ విభాగాలు ఉద్యోగ నోటిఫికేష‌న్ కు సంబంధించిన ప్ర‌క్రియ‌ను షురూ చేయ‌కూడ‌దు.

2. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న వారు.. వారి త‌ర‌ఫు ప్ర‌చారం చేసేవారు జ‌న‌సామ్యం వ్య‌క్తిగ‌త జీవితాల్ని గౌర‌వించాలి.

3. అందుకు భంగం క‌లిగేలా రోడ్ షోలు.. ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్ట‌కూడ‌దు.

4. ప్ర‌చార ర్యాలీలు.. రోడ్ షోల పేరుతో ట్రాఫిక్ కు ఇబ్బంది క‌లిగించేలా చేయ‌కూడ‌దు.

5. అధికార పార్టీలు.. రాష్ట్ర.. కేంద్ర ప్ర‌భుత్వాలు కొత్త సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని చేప‌ట్ట‌రాదు

6. రోడ్ల నిర్మాణం మొద‌లుకొని ప్రారంభోత్స‌వాల వ‌ర‌కూ ఏ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌కూడ‌దు. చివ‌ర‌కు మంచినీటి సైక‌ర్యం క‌ల్పించ‌టం లాంటివి కూడా చేయ‌కూడ‌దు.

7.   ప్రభుత్వ అతిథిగృహాలు, బంగ్లాలు, సమావేశ స్థలాలు, బహిరంగ ప్రదేశాలను అంద‌రు అభ్య‌ర్థులు వాడుకోవ‌చ్చు.

8.  కొద్దిమందికి మాత్ర‌మే ఇలాంటి వాటిపై హ‌క్కు ఉన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం త‌ప్పు. అలాంటి వాటికి అవ‌కాశం లేదు.

9.  పోలింగ్ రోజు బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులంతా పోలింగ్ సాఫీగా జ‌రిగేలా అధికారుల‌కు స‌హ‌కారం అందించాలి.

10.  పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఎన్నిక‌ల చిహ్నాల‌ను ప్ర‌ద‌ర్శించ‌కూడ‌దు.

11. ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇచ్చే ప్ర‌త్యేక అనుమ‌తి ప‌త్రం ఉన్న వారు మాత్ర‌మే పోలింగ్ కేంద్రంలోకి ప్ర‌వేశించేందుకు అర్హ‌త ఉంటుంది.

12.  ఎన్నికలకు సంబంధించిన ఏ అంశంపైనైనా ఫిర్యాదులు స్వీకరించేందుకు  అధికారులు ఉంటారు.\

13. ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీ వినియోగించ‌కూడ‌దు.

14. మంత్రులు అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కాకూడ‌దు. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు.

15. ప్రచారం కోసం వాడే లౌడ్‌ స్పీకర్లకు స్థానిక అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి  తీసుకోవాలి.

16. అన్న  రాజకీయ పార్టీలు.. అభ్యర్థులకు ఈ నిబంధ‌న వర్తిస్తుంది. బరిలో ఉన్న అభ్యర్థులు తమ ర్యాలీల గురించి ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలి.
Tags:    

Similar News