పంచాయితీ సిరా ఆ వేలిక‌ట‌!

Update: 2019-01-03 09:43 GMT
ఎన్నిక‌లు ఏవైనా ఓటేసిన త‌ర్వాత చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్ట‌టం తెలిసిన విష‌య‌మే. అన్నింటి మాదిరే త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల సంద‌ర్భంలోనూ చూపుడు వేలికే సిరా చుక్క పెట్టే అవ‌కాశం లేదంటున్నారు. ఎందుకంటే.. దానికో కార‌ణం ఉందంటున్నారు ఎన్నిక‌ల అధికారులు.

తెలంగాణ‌లో ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటేసిన‌ప్పుడు చూపుడు వేలికి సిరా చుక్క‌ను ఓటేసిన దానికి గుర్తుగా పెట్ట‌టం.. అదిప్ప‌టివ‌ర‌కూ పూర్తిగా చెర‌గ‌క‌పోయిన ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని గుర్తించిన ఎన్నిక‌ల అధికారులు పంచాయితీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటేసిన త‌ర్వాత వేసే సిరా చుక్క‌ను మ‌రో వేలికి వేయాల‌ని డిసైడ్ అయ్యారు.

కాకుంటే.. చుక్క పెట్ట‌టానికి ఎంపిక చేసుకున్న వేలితోనే ఇప్పుడు ఇబ్బంది అంతా. చూపుడు వేలి త‌ర్వాత వేలిని సిరా చుక్క పెట్టేందుకు ఎంపిక చేశారు. అయితే.. ఈ వేలికి వేయ‌టం కంటే ఉంగ‌రం వేలికి వేస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతుంది. బూతుకు గుర్తుగా వినియోగించే వేలికి సిరా చుక్క వేసే బ‌దులు.. ఆ ప‌క్క‌నే ఉన్న రింగు ఫింగ‌ర్ కు సిరా చుక్క‌ను పెట్టేస్తే స‌రిపోతుంద‌న్న మాట‌ను కొంద‌రి నోట వినిపిస్తోంది.

చిన్న చిన్న విష‌యాల్ని ఎన్నిక‌ల సంఘం గుర్తిస్తుందా? అయినా ఎవ‌రో.. దేనికో గుర్తుగా వాడ‌తార‌ని చేతికి ఉన్న వేళ్ల‌ను వ‌ద్దంటే ఎలా అన్న మాట కొంద‌రు అధికారుల నుంచి వ‌స్తోంది. ఈ సంగ‌తి ఎలా ఉన్నా.. పంచాయితీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా మాత్రం సిరా చుక్క చూపుడు వేలు ప‌క్క పేలుకు షిఫ్ట్ కావ‌టం ఖాయం. సున్నిత‌మైన అంశాన్ని ఎన్నిక‌ల అధికారులు ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని మారిస్తే మ‌రింత బాగుంటుంద‌న్న భావ‌న ప‌లువురి నోట వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రేం చేస్తారో చూడాలి.


Full View
Tags:    

Similar News