శతకోటి దరిద్రాలకు...అనంతకోటి ఉపాయాలు అన్నారు. రాజకీయ నాయకులు తమ ఎన్నికల ప్రచారానికి ఎన్ని వ్యూహలు పన్నుతున్నారో.....వాటికి అంతలా చెక్ పెడుతోంది ఎలక్షన్ కమీషన్. పూర్వం ఎన్నికల ప్రచారంమంటే రాజకీయ నాయకులు గడప - గడపకి తిరిగి తమకు ఓటు వేయమని అభ్యర్దించేవారు, కాని ఇప్పుడు పూర్వం అంత కష్టపడాల్సిన అవసరం లేకుండానే రాజకీయ నాయకులు గడప గడపకీ వస్తున్నారు.....ఎలాగంటారా... సోషల్ మీడయా వేదికగా......అవును ఇప్పుడు రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా తమ ఎన్నికల ప్రచారాన్ని చేపడుతున్నారు. సోషల్ మీడియాలో పార్టీల అభ్యర్దులు ఈ-ప్రకటనలతో హోరేత్తిస్తున్నారు. ఈ-ప్రకటనల కోసం రాజకీయ నాయకులు ప్రత్యక విభాగాలను నియమించుకున్నట్లు సమాచారం. ఓటరు ఫోన్ నంబరు లేక ఈ-మెయిల్ ఐడి తెలిస్తే, ఆ సదరు నెంబరుకు కాని - మెయిల్ ఐడికి కాని సోషల్ మీడియాలో ప్రకటనల చేయవచ్చు. ఈ అవకాశాన్ని కొంత మంది రాజకీయ నాయకులు తమ అనుకూల ప్రచారానికి వాడుకుంటున్నారు.
అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ ఈ వ్యవహారంపై ద్రుష్టి పెట్టనుంది. సోషల్ మీడియపై తన డేగ కన్నేసి ఉంచాలని, ఈ-ప్రకటనలకు అయ్యె ఖర్చుపై ఆరా తీసేందుకు సన్నద్దమవుతోంది. ఒకవేళ రాజకీయ నాయకులు ఖర్చులు చూపించకపోతే, ఆ ఖర్చుపై ఆరా తీసి, ఆ ఖర్చు వివరాలను నేతలకు పంపించి - వివరణ కోరేందుకు సిద్దపడుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియా సర్వీస్ ప్రోవైడర్ల అధికారులతో ఎన్నికల ప్రధాన కమిషనర్ రావత్ ఇటీవలే సమావేశమైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియలో ప్రకటనలపైన, వాటికోసం ఖర్చు చేసిన మొత్తం పైన తమకు పూర్తి వివారాలు ఇవ్వాలని ఆదేనశించినట్లు సమాచారం. అంతేకాకుండా ఎవరైన సోషల్ సమీడియాలో తప్పుడు పోస్టులు లేక కామెంట్లు పెడితే అవి కొద్దిసేపటిలోనే తొలగిపోయే విధంగా అల్‌గారి రిథమ్ ను రూపోందించినట్టు ఫేస్ బుక్ - గూగుల్ - ట్విట్టర్ అధికారులు ఎలక్షన్ కమీషన్ కు తెలిపినట్లు సమాచారం. పోలింగ్ కు రెండు రోజులు ముందు సైలెన్స్ పీరియడ్ గా ప్రకటిస్తామని ఈసీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.