కండువాలపై కేసీఆర్ కు ఈసీ నోటీసులు

Update: 2015-12-10 15:35 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని రాజకీయ వేడుకులకు వాడుకున్నారన్న అంశం మీద తనకు అందిన ఫిర్యాదు మీద స్పందించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మంత్రి కేటీఆర్ లు ఇద్దరికి నోటీసులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్.. దీనిపై తమ వివరణ ఇవ్వాలని కోరింది. ఇందుకోసం రెండు రోజుల సమయం ఇచ్చింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా నేతలు పలువురికి టీఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించటం తెలిసిందే. సీఎం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్.. సచివాలయంలో మంత్రి కేటీఆర్ లు ఇద్దరూ ఇదే తీరుతో వ్యవహరించటంపై ఈసీకి ఫిర్యాదులు అందాయి.

వీటిని పరిశీలించిన ఈసీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కుమారుడు కేటీఆర్ లకు నోటీసులు జారీ చేసింది. మరి.. ఈసీ ప్రశ్నకు వీరిద్దరూ ఏం సమాదానం చెబుతారు? దానికి ఈసీ ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News