నేత‌ల‌కు చుక్క‌లు చూపేలా ఈసీ కొత్త రూల్‌

Update: 2017-05-27 04:34 GMT
కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌రికొత్త రూల్ ఒక‌టి తాజాగా అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ఎన్నిక‌ల్లో అవినీతిని తగ్గించ‌టంతో పాటు.. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో పార‌ద‌ర్శ‌క‌త‌ను తీసుకురావ‌టానికి సాయం చేసేలా ఒక కొత్త నిబంధ‌న‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీసుకొచ్చింది. ఈ తాజా నిబంధ‌న పుణ్య‌మా అని ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు కొత్త  చిక్కుల్ని తీసుకురావ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో ఇక‌పై ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్లు దాఖ‌లు చేసే స‌మ‌యంలో త‌మ సొంత ఆదాయ మార్గాల‌తో పాటు.. జీవిత భాగ‌స్వామి ఆదాయ మార్గాల్ని సైతం వెల్ల‌డించాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రూల్ ప్ర‌కారం.. ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే కుటుంబ స‌భ్యులు త‌మ ఆస్తుల్ని.. అప్పుల్ని వెల్ల‌డిస్తున్నారు. అదే స‌మ‌యంలో పోటీ బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థి మాత్రం త‌న‌కున్న ఆదాయ మార్గాల్ని కూడా వెల్ల‌డిస్తున్నారు.

తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల్ని స‌వ‌రించింది. ఆఫిడ‌విట్‌ లో ప్ర‌త్యేకంగా ఒక కాల‌మ్‌ ను కేటాయించింది. దీని ప్ర‌కారం.. అభ్య‌ర్థి త‌న ఆదాయ మార్గాల్ని ఏ విధంగా అయితే ప్ర‌క‌టిస్తారో.. అదే రీతిలో త‌న జీవిత భాగ‌స్వామికి సంబంధించిన ఆదాయ మార్గాల్ని ప్ర‌క‌టించాల్సి ఉంటుంది. దీంతో.. భార్య భ‌ర్త‌ల ఇద్ద‌రి ఆస్తిఅప్పుల‌తో పాటు.. వారి కుటుంబానికి వ‌చ్చే ఆదాయ‌మార్గాలు ఎన్ని అన్న వివ‌రాలు మొత్తంగా బ‌య‌ట‌కు రానున్నాయ‌న్న మాట‌.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News