తెలంగాణలోని అత్యధిక జనాభాకు లబ్ధి చేకూర్చేలా కేసీఆర్ గత ఖరీఫ్ సీజన్ లో ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ఎంతో ప్రశంసలు పొందింది. దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. అయితే ఇప్పుడు ముందస్తు ఎన్నికల వేళ ఓట్లు కురిపించే ఈ పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.. ఇది టీఆర్ ఎస్ కు ఎన్నికల్లో బాగా లబ్ధి చేకూర్చే పథకం కావడంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేశారు.
తాజాగా ఎన్నికల కమిషన్ రైతు బంధు పథకంపై కేసీఆర్ - టీఆర్ ఎస్ ప్రభుత్వానికి షాకిచ్చింది. అటు రైతులకు లబ్ధి చేకూర్చేలా.. ఇటు కేసీఆర్ కు ఎలాంటి లబ్ధి కలుగకుండా రైతుబంధు చెక్కుల పంపిణికి ఆమోదం తెలిపింది.
ఇప్పటికే తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగకు టీఆర్ ఎస్ పంచే చీరలకు ఈసీ మోకాలడ్డింది. ఇప్పుడు రైతుబంధును కూడా అడ్డుకుంటుందని అనుకున్నారు. కానీ కొన్ని నిబంధనలు - షరతులతో రైతు బంధు అమలుకు ఆమోదం తెలిపింది.
తాజాగా ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్కే రుడోలా రైతుబంధు స్కీమ్ ను కొన్ని కఠిన నిబంధనలు - షరతులతో అమలు చేసేందుకు తెలంగాణ అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఈ రైతు బంధు చెక్కుల పంపిణీలో కొత్తగా నమోదు చేసుకున్న రైతులకు ఇవ్వవద్దని ఈసీ నిబంధనపెట్టింది. గత ఖరీఫ్ లో ఎవరికైతే ఎకరానికి రూ.4వేలు పంచారో వారికే ఇవ్వాలని సూచించింది. రైతుబంధు పథకం అమలులో రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఎలాంటి హడావుడి లేకుండా చేయాలని ఆదేశాలిచ్చింది. అంతేకాదు.. నేరుగా రైతులకు చెక్కులు ఇవ్వకుండా అధికారులే బ్యాంకుల ద్వారా వారి ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు. దీనివల్ల ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి లబ్ధి చేకూరదని.. రైతులకు మాత్రం ఆశించిన ప్రయోజనం దక్కుతుందని స్పష్టం చేసింది.
కాగా ఆపద్ధర్మ కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.4 వేల చొప్పున చెల్లించేందుకు ఈ శనివారం నుంచి ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.5500 కోట్లు ఇప్పటికే బ్యాంకులకు చెల్లించింది. ఇక అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఇలా ఈసీ షాకిస్తూ టీఆర్ ఎస్ కు ఎటువంటి ప్రయోజనం దక్కకుండా పంచడానికి పూనుకుంది.