ఎన్నికల వేళలో ఎగ్జిట్ పోల్స్..సర్వే నివేదికలు వెల్లడించటం తప్పన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రతి పనికి మరో అడ్డదారి ఉన్నట్లే.. ఎన్నికల సంఘం పరిమితులు విధించే ఎగ్జిట్ పోల్స్.. సర్వేలకు భిన్నంగా కొన్నివర్గాలు ప్రదర్శిస్తున్న తెలివితేటలకు సరికొత్త చెక్ చెబుతూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉన్న వేళలో.. జ్యోతిష్యాలు.. వివిధ రంగాల వ్యక్తుల చేత అభిప్రాయాలు చెప్పించటం.. వారి గెలుపోటముల మీద అంచనాలు వేయటం లాంటివి కూడా నిషేదమని ఈసీ స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధాన్ని విధించింది. ఈ సమయంలో కొన్ని ఛానెళ్లు తమ తెలివికి పదును పెట్టాయి. ఫలానా పార్టీ.. ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న విషయాన్ని తెలియజెప్పేలా.. కొంతమంది వ్యక్తులు.. కొంతమంది జ్యోతిష్యులతో వివిధ కార్యక్రమాల్ని నిర్వహించారు.
ఈతరహా కార్యక్రమాల నిర్వహణ ఇదే తొలిసారి.దీనిపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇలాంటి కార్యక్రమాలు సైతం నిషేధిత జాబితాలో ఉంటాయని.. ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం ఉన్న వరకూ ఎలాంటి అంచనాలు.. జ్యోతిష్యాలు వెల్లడించకూడదని స్పష్టం చేశారు. ఇలా చేస్తే.. రూల్స్ ను బ్రేక్ చేసినట్లేనని స్పష్టం చేసింది. మరి.. ఈసారి మరెలాంటి సిత్రమైన ఆలోచన చేస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/