రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది నంద్యాల ఉప ఎన్నిక ఫలితం. ఈ ఉప ఎన్నికను ఏపీ అధికార.. ప్రధానప్రతిపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం తెలిసిందే. నువ్వా.. నేనా అన్నట్లు సాగుతున్న ఈ ఉప ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ ఇప్పటికే నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
నంద్యాల ఉప ఎన్నికలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా గెలవాలన్న ఆలోచనతో విచ్చలవిడిగా డబ్బు.. మద్యం వినియోగిస్తున్నారని.. అధికార దుర్వినియోగం జరుగుతుందన్న ఆరోపణలకు బలాన్ని చేకుస్తూ.. తాజాగా ఎన్నికల నిగా వేదిక రాష్ట్ర కమిటీ ఆరోపించింది. ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ఓట్లను స్వేచ్ఛగా.. ప్రశాంతంగా వినియోగించుకోవాలని కోరుతూ కమిటీ ఛైర్మన్ జస్టిస్ అంబటి లక్ష్మణరావు.. కన్వీనర్ లక్ష్మణరెడ్డిలు కోరారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ను కలిసిన కమిటీ సభ్యులు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్ లో సీసీ కెమేరాలు.. వెబ్ కెమేరాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికపై వస్తున్న విమర్శల నేపథ్యంలో.. దీనికి సంబంధించిన ఏదైనా ఫిర్యాదు ఉంటే 1950 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల అక్రమాలకు చెక్ పెట్టేందుకు వీలుగా 08518–277305 - 08518–277309లకు కంప్లైంట్ చేసే అవకాశం ఉంది.