ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. రానున్న రోజుల్లో ఇదో పెను వివాదంగా మారే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరి విషయంలోయుద్ధ ప్రాతిపదికన స్పందిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం.. మరికొన్ని విషయాల్లో అస్సలు రియాక్ట్ కాని విధంగా వ్యవహరిస్తున్నారన్న అపవాదను మూటగట్టుకోవటం తెలిసిందే.
ఈ ఆరోపణలు.. విమర్శలు మరింత పెరిగే అవకాశం తాజా నిర్ణయంతో ఉంటుందని చెప్పక తప్పదు. పశ్చిమబెంగాల్ లో ప్రధాని మోడీ చేసిన సంచలన ప్రకటన సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనలు సద్దుమణగక ముందే.. ఈసీ తీసుకున్న తాజా నిర్ణయం వాతావరణం మరింత వేడెక్కిపోయేలా ఉందని చెప్పాలి. కేంద్ర బలగాలతో భద్రత కల్పించని పక్షంలో తాము ఎన్నికలు నిర్వహించబోమని పశ్చిమబెంగాల్ పోలింగ్ సిబ్బంది భీష్మించుకోవటంతో ఎన్నికల సంఘం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది.
రానున్న రోజుల్లో జరిగే మూడు దశల లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించే అన్ని పోలింగ్ స్టేషన్లలో బెంగాల్ రాష్ట్ర పోలీసులకు బదులుగా.. కేంద్ర బలగాల్ని మొహరించాలని నిర్ణయించారు. గడిచిన నాలుగు దశల పోలింగ్ సందర్భంలోనూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. కేంద్ర బలగాల్ని ప్రయోగించటం ద్వారా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పశ్చిమబెంగాల్ చరిత్రలో భారీ ఎత్తున కేంద్ర బలగాల్ని రంగంలోకి దింపటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. రానున్న మూడుదశల్లో జరిగే ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ మొత్తంలో 600 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాల్ని రంగంలోకి దించనున్నారు. అవసరమైతే మరో వంద కంపెనీలకు పెంచుతామని ఈసీ ప్రకటించటం గమనార్హం. ఈసీ తీసుకున్న తాజా నిర్ణయంపై మమత సర్కారు తీవ్రంగా స్పందించే వీలుందని చెబుతున్నారు. ఏమైనా.. ఈసీ నిర్ణయం అనూహ్యంగా ఉండటమే కాదు.. విపక్షాలు వేలెత్తి చూపేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.