ఇంట్లో జరిగే శుభకార్యాలకు పిలిచేందుకు ఇన్విటేషన్లు తయారు చేయటం మామూలుగా ఉండేదే. అయితే.. కొన్ని కీలకమైన రోజుల్లో శుభకార్యాలు పెట్టుకుంటే.. అతిధులు వచ్చే విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తిస్తూ.. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన కొందరు చేసిన ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఎంతో అతృతతో దేశ వ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. దీనికి సంబంధించి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాయి మీడియా సంస్థలు. ఆ రోజు నాటికి మిగిలినపనుల్ని పక్కన పెట్టేసి.. టీవీలో లైవ్ చూసే ప్రోగ్రాంకు చాలామంది సిద్ధమవుతున్నాయి. మరి.. ఇలాంటి రోజున ఇంట్లో పెళ్లి శుభకార్యం పెట్టుకుంటే ఎంత ఇబ్బంది?
దీనికి పరిష్కారంగా నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖులు పలువురు భలేగా ఆలోచించారు. పెళ్లి వేడుకకు వస్తే.. ఎన్నికల రిజల్ట్ కు సంబంధించిన అంశాలు మిస్ కాకుండా.. లైవ్ ఏర్పాట్లు చేస్తున్నామంటూ శుభలేఖల్లో ముద్రిస్తూ పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 23న నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున శుభకార్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు తమ శుభలేఖల్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించిన టీవీ లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లను ప్రత్యేకంగా చేస్తున్నామని.. కాబట్టి అందరూ హాజరు కావాలంటూ కోరుతున్నారు. ఈ తరహా ఇన్విటేషన్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.