కొవిడ్ వేళ తెలంగాణలో ఎన్నికలు.. భారీగా ఏర్పాట్లు

Update: 2020-10-09 03:30 GMT
కరోనా వేళ తెలంగాణలో తొలిసారి జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కుమార్తె కమ్ మాజీ ఎంపీ కవిత.. బీజేపీ నుంచి లక్ష్మీ నారాయణ.. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో పని చేసే సిబ్బందికి ఎట్టి పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి నాలుగు పీపీఈ కిట్స్ సరఫరా చేస్తున్నారు. ఒక.. ఓటరుకు సపరేట్ గా పీపీఈ కిట్స్ ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో పని చేసే అధికారి తప్పనిసరిగా ఫేస్ షీల్డ్.. మాస్క్.. గ్లౌజ్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్ స్టేషన్ కు పది చొప్పున శానిటైజర్లను అందిస్తున్నారు. కోవిడ్ కు సంబంధించిన ఫ్లెక్సీలు ప్రముఖంగా ఏర్పాటు చేయటంతో పాటు.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి భారీగా ప్రచారం చేస్తున్నారు.

ఈ ఎన్నికల బ్యాలెట్ పేపర్ తో జరగనుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో ఓటు వేస్తే చెల్లదు. ఓట్లు వేసే ఓటర్లను గుర్తించేందుకు ఎంపీడీవో లేదంటే మున్సిపల్ కమిషనర్ విధులు నిర్వర్తించనున్నారు. సెల్ ఫోన్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా లోపలకు తీసుకెళ్లనివ్వరు.

ఈ ఎన్నికల్లో 824 మంది స్థానిక సంస్థ ఓటర్లు ఉంటారు. వీరి కోసం 50 పోలింగ్ కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. వీటిల్లో ఒక పోలింగ్ కేంద్రంలో అత్యధికంగా 67 ఓటర్లు ఉంటే.. మరోచోట అత్యల్పంగా నలుగురు ఓటర్లు కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో14 సమస్మాతక పోలింగ్ కేంద్రాల్ని గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఈ ఎన్నిక కోసం 399 సిబ్బందికి పోలింగ్ విధులు  నిర్వహించనున్నారు.

ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఓటు వేసేందుకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వీలుకాదంటే పోస్టల్ ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. కాదు.. నేరుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని భావిస్తే మాత్రం.. సాయంత్రం నాలుగు నుంచి ఐదు మధ్యలో వచ్చి ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.

పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది. ఒకవేళ.. ఐదు గంటల వేళకు ఎవరైనా ఓటు వేసేందుకు వరుసలో ఉంటే.. సమయం ముగిసిన తర్వాత కూడా ఓటు వేసే అవకాశం ఇస్తారు. కోవిడ్ పేషెంట్లుగా ఉన్న ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి.. ఓటు వేసిన తర్వాత మళ్లీ డ్రాప్ చేసే వెసులుబాటును కల్పించారు. సొంత వాహనం ఉన్న వారు.. తమ వాహనంలో వచ్చి ఓటేయొచ్చు.
Tags:    

Similar News