మునుగోడు ఊపులో ‘ముందస్తు' ఎన్నికలు నిర్వహించేందుకు కేసీఆర్ ఆరాటపడుతున్నారు. ఈ నెల 15న కేసీఆర్ టీఆర్ఎస్ కార్యవర్గ కీలక సమావేశం అందుకే నిర్వహిస్తున్నారా? అనే ప్రచారం తాజాగా సాగుతోంది. గతంలో తెలంగాణ తొలిప్రభుత్వంలో కేసీఆర్ ఇలానే ముందస్తుకు వెళ్లి గెలిచారు. బలం పెంచుకున్నారు. ఈసారి కూడా అదే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 15న కేసీఆర్ అద్యక్షతన టీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో పాజిటివ్ ఫలితం రావడంతోపాటు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్రం ఢీ అంటే ఢీ అనడంతో తేల్చుకోవాలనే పట్టుదలతోనే కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ ఊపులోనే బీజేపీని ఓడించవచ్చని భావిస్తున్నారు. వేడి తగ్గక ముందే విజయం సాధించాలని చూస్తున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ నేతలతో కీలక సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకోనున్నారనే ప్రచారం సాగుతోంది.
మరోవైపు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చు ప్రక్రియ కొనసాగుతోంది. బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన తర్వాత పార్టీ యాంత్రాంగం ఏ విధంగా పనిచేయాలి? పార్టీ కమిటీలు, ఇతర రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలపై చర్చించే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో ఎలాంటి పోరాటాలు చేయాలి? అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాజకీయంగా ఎలాంటి ఉద్యమాలు చేయాలనే దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 డిసెంబర్ లో జరుగుతాయి. దానికంటే ముందే 100 నెలల నిర్ణీత కాలం కంటే ముందుగా ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ రెడీ అయినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కీలకమైన సమావేశం నిర్వహించడానికి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పలు సర్వేలు చేయించుకున్న కేసీఆర్.. తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఏ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే మళ్లీ అధికారం దక్కుతుందనే విషయంపై కేసీఆర్ పక్కా లెక్కలు, జోతిష్యాన్ని పాటిస్తున్నారని తెలుస్తోంది. సంచలన నిర్ణయాలకు మారుపేరైన కేసీఆర్ ఈ మంగళవారం తర్వాత ఏమైనా చేయవచ్చనే పేరు తెచ్చుకున్నారు. ఆయన మనసులో ఏముందో ఈ మంగళవారం తేలనుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.