ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ ఎన్నికల నగారా మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో మూడు దఫాలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ప్రధాన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రెడీ అయినట్టు తెలిసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఒక విడతగా.. మున్సిపల్ ఒక విడతగా.. పంచాయితీలు రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఈనెల 11 నుంచి 13 వరకు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని సమాచారం. 23న పోలింగ్ నిర్వహించి.. 27న కౌంటింగ్ చేపట్టడానికి ఈసీ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు షెడ్యూల్ ఇలా ఉంటుందని అంటున్నారు. ఈనెల 11 నుండి 13 వరుకు నామినేషన్స్... 23 పోలింగ్, 27 కౌంటింగ్ ఉంటుందని చెబుతున్నారు.
గ్రామపంచాయితీలకు రెండు ఫేజులుగా నిర్వహిస్తారని అంటున్నారు. ఫేజ్ 1 - 17 నుండి 19 వరుకు నామినెషన్స్..27 న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఫేజ్ -2 ఈనెల 19 నుండి 21 వరుకు నామినేషన్స్ 29 న పోలింగ్, 29 నే కౌంటింగ్ ఉంటుందని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.
అయితే అధికారికంగా ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఈ ఎన్నికలపై స్పందించలేదు .కేవలం ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నారని.. ఈ క్రమంలోనే ఈ తేదీల్లోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఈసీ వర్గాల ద్వారా మీడియాలో ప్రచారం సాగుతోంది.