గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ యువరాజు.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది నెలల్లో రానున్న యూపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. మిగిలిన పార్టీల కంటే ఎంతో ముందుగా ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఖాట్ చర్చా పేరుతో.. గ్రామాల్లో రైతులతో మంచాలు వేసి మరీ భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ మంచాల సభలు దారుణంగా విఫలమయ్యాయి. ఈ సభల్లో రాహుల్ మాటల కంటే కూడా.. కాంగ్రెస్ పార్టీ వారు వేసే మంచాలు తీసుకెళ్లటానికి పెద్ద ఎత్తున జనాలు పోటెత్తటం.. సభలో మంచాలు తీసుకెళ్లటం అదో ఫన్నీ యవ్వారంగా మారింది.
అయినప్పటికీ తాను నమ్మిన ఖాట్ చర్చ ను నిర్వహిస్తూ.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ముందుకెళుతున్నారు రాహుల్. తాజాగా ఆయన ఆగ్రాలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఆగ్రా ర్యాలీలో స్థానిక ఫవారా చౌక్ లో అగ్రసేన్ విగ్రహానికి పూల మాల వేసే కార్యక్రమం ఉంది. దీనికి హాజరైన ఆయన.. విగ్రహానికి పూలమాలవేసే క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగ ఒక్కసారిగా మీద పడటం.. అందరికి ఆందోళన కలిగించింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో కరెంటు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. బయటపడిన రాహుల్.. ఈ ఘటన గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నువ్వు నాకు కరెంటు షాక్ ను ఇచ్చావ్’’ అంటూ సరదాగా యూపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జరిగిన ఘటనను రాహుల్ సింఫుల్ గా తీసుకున్నా.. ఈ ఘటన చాలా ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. జరిగిన ఘటనతో రాహుల్ భద్రతాసిబ్బంది షాక్ తిన్న పరిస్థితి. మరోవైపు.. రాహుల్ కు స్వల్ప విద్యుద్ఘాతం తగిలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/