ట్విట్టర్ ను కంపు చేశాడు.. ఇప్పుడు యూట్యూబ్ నా?

Update: 2022-06-08 16:30 GMT
ఎలన్ మస్క్.. ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు. పైగా టెస్లా కంపెనీ సీఈవో. ఈ అపర కుబేరుడికి ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేనిదే నిద్రపట్టదు. ప్రస్తుతం ఇతగాడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ట్విట్టర్ లో గత కొన్ని నెలలుగా ఇతగాడి పేరు హల్ చల్ చేస్తోంది.

ఎలన్ మస్క్ ఏకంగా 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం.. ట్విట్టర్ దాన్ని అంగీకరించడం చకచకా జరిగింది. ఈ అపరకుబేరుడు ఏకంగా తన చేతుల్లోకి వస్తే ట్విట్టర్ లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మరింతగా ఇనుమడిస్తాయని గొప్పలకు పోయాడు. కానీ కట్ చేస్తే చివరి క్షణంలో స్పామ్ ఖాతాల పేరు చెప్పి ట్విట్టర్ డీల్ ను హోల్డ్ లో పెట్టాడు. అస్సలు కొనేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో ట్విట్టర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసి దాన్ని కంపుకంపు చేశాడు.

ట్విట్టర్ ను కొనేముందు దానిపై విమర్శలు చేస్తూ ఆ సంస్థలోకి షేర్లు కొని ఎంట్రీ ఇచ్చి గబ్బు గబ్బు చేశాడు. దాన్ని భ్రష్టు పట్టించాక ఇప్పుడు కొనను అంటూ అనడంతో ట్విట్టర్ పై వ్యాపార వర్గాల్లో విశ్వసనీయత పోయినట్టైంది. ట్విట్టర్ ను కంపు చేసిన ఎలన్ మస్క్ ఇప్పుడు యూట్యూబ్ పై పడ్డాడు.

ఇప్పుడు ఎలన్ మస్క్ దృష్టి యూట్యూబ్ పై పడినట్లు చర్చ సాగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. మస్క్ వరుస ట్వీట్లతో యూట్యూబ్ పై విమర్శలు చేశాడు. యూట్యూబ్ స్కామ్ యాడ్స్ తో నిండిపోయిందని అంటూ యూట్యూబ్ లో స్కామ్ ప్రకటనలు ఉన్నాయనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం అతడు ఒకటి కాదు.. రెండు సార్లు వరుసగా ట్వీట్లు చేశాడు. దీంతో నెటిజన్లు సైతం మస్క్ ఇక యూట్యూబ్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ను కొంటానంటూ ముందు విమర్శలకు దిగారు. ఆ తర్వాత దాన్ని పక్కనపెట్టి ఇమేజ్ డ్యామేజ్ చేుశాడు. ఇప్పుడు ఆన్ లైన్ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ పై ఎలన్ మస్క్ పడ్డాడు. మంగళవారం మస్క్ ట్విట్టర్ లో వరుసగా రెండు ట్వీట్లు చేశాడు. యూట్యూబ్ స్కామ్ యాడ్స్ తో నిండిపోయిందని అందులో పేర్కొన్నాడు.  యూట్యూబ్ లో స్కామ్ ప్రకటనలు ఉన్నాయనే విషయాన్ని నొక్కి చెప్పడం కోసం అతడు వరుసగా రెండు ట్వీట్లు చేశాడు. దీంతో నెటిజన్లు మస్క్ చూపు యూట్యూబ్ పై పడిందంటూ ట్రోల్ చేస్తున్నారు.

కొందరు మాత్రం మస్క్ ను జోక్ గా తీసుకోవద్దని.. ఆయన తదుపరి లక్ష్యం యూట్యూబ్ అంటూ రీట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మస్క్ యూట్యూబ్ ను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. మస్క్ ట్వీట్లతో యూట్యూబ్ ను మస్క్ కొనాలన్న హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది.

అయితే ఎలన్ మస్క్ ఏది చేసినా దాన్ని నీరుగారిపోయేలా చేసి వాడుకొని వదిలేస్తాడని పేరుంది. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత ట్విట్టర్ ను అథోగతి పాలు చేశాడు. ఇప్పుడు యూట్యూబ్ ను కొనుగోలు చేస్తానంటూ దాన్ని భ్రష్టు పట్టించేందుకు రెడీ అవుతున్నారు. చూస్తుంటే ప్రపంచ సోషల్ మీడియాలకు విశ్వసనీయత లేకుండా చేసే ఎత్తుగడ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది.
Tags:    

Similar News